Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అవధి లేని
సంతోషానికి దిక్సూచి..
పుట్టినింటి బాంధవ్యాన్ని
మెట్టినింటి బాధ్యతని సరి సమంగా నిర్వర్తిస్తూ
అనుక్షణం మధురభావ భాగ్యాన్ని సర్వత్రా పంచే అతివలు..
ఇంటింటి సౌభాగ్య దేవతలు
చెల్లిగా, తల్లిగా, ఆలిగా బహురూప విన్యాసాలతో అలరిస్తూ
మమతల మల్లెతీగను పెనవేసే మాధురీ మనస్కులు
అచ్చమైన మానవత్వరూపంతో
తారతమ్యాలు చూపని
మదర్ థెరెసాలెందరో
విశ్రాంతి ఎరుగని విశ్వక్షేమ కాంక్షితులు
సిరులవాన కురిపించే అయాచిత వరప్రదాతలు..మహిలో మహిళలు!
- సుజాత.పి.వి.ఎల్.
సైనిక్ పురి, సికిందరాబాద్.