Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కలల ప్రపంచం ఇది కలల ప్రపంచం
మాయా వలల ప్రపంచం
తండ్రి తాతల పేరు చెప్పి
లేనిపోని గొప్పచెప్పే
తప్పులెన్నడు చేయకు
తప్పటడుగులు వెయ్యకు !!
కలలు కంటూ కలలలోనే ఉండిపోతూ
కలలలోనే తేలిపోతూ ,కల్లలోనే తూలిపోతూ
నిట్టనిలువుగ మునిగిపోకు !!
కలలోనైన ,ఇలలోనైన
లక్ష్యమన్నది పెట్టుకో
విశ్రమించక విజయమన్నది పట్టుకో!!
నిన్నుగన్న మాతపితలకు
వీడే మా బిడ్డడని చెప్పుకునే చరితనివ్వు
జన్మనిచ్చిన భరతమాతకు భవితనివ్వు !!
వేదమూర్తుల ,త్యాగమూర్తుల, తత్వవేత్తల
శాస్త్రవేత్తల గన్న వేదభూమిలో
నీవు వ్యర్థజీవిగ మారబోకు !!
లక్ష్యమన్నది పెట్టుకో
దానిపై ఇష్టమన్నది పెంచుకో
విజయమన్నది కష్టమేమీ కాదు కాదని తెలుసుకో !!
అలవిమాలిన లక్ష్యమైనా
వల్లమాలిన ప్రేమ ఉంటే
అసాధ్యమంతా సుసాధ్యమే సుమా !!
జీవితాన్ని కలలకే నైవేద్యమిడక
పట్టుబట్టీ నీ ప్రతిభనంతా వెలికితీసి
మనసుకంటిన మకిలి తీసీ
బద్ధకాన్ని మట్టుబెట్టి
జీవితంపై ఓ ఒట్టుపెట్టి
పట్టుదలతో భవితనంతా వెలగనియ్యి !!
- సబ్బు నాగయ్య ప్రజాకవి
రాజుపెట
9573996828