Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనోవ్యాధికి మందు లేదన్నది పెద్దల మాట...
"మనిషి బ్రతుకు నరకమౌను మనసు తనది కానిదే" నన్నది కవి గారి మాట...
వ్యాయామం, పోషకాహారం, చక్కని జీవనశైలితో మనసును నీ ఆధీనంలో ఉంచుకోవడం
నీ పనేనన్నది నేటి ఆధునిక వైద్యుల మాట...!
శారీరక ఆరోగ్యానికి మానసిక ఆరోగ్యమే మూలం...
కుంగుబాటు, హిస్టీరియా,స్కిజోఫ్రీనియా,
డిమెన్షియా వంటి పలు రుగ్మతలకు
రసాయనాలఅసమతుల్యం,
వంశపారంపర్యం,అభద్రత
పేదరికం,పరిసరాలు,అవిద్య,
నిరక్షరాస్యత వంటివెన్నో మూలకారణాలు...!!
దుష్టశక్తులు,చేతబడులంటూ
అజ్ఞానంతో భూతవైద్యులను,
దొంగ బాబాలను ఆశ్రయిస్తూ...
మోసపోతున్న ప్రజలు...!!!
శక్తిని హరించే ప్రతికూల భావోద్వేగాలను, అరిషడ్వర్గాలను వదిలించుకుని...
ఒత్తిడిని,చింతను ఆధ్యాత్మిక చింతనతో, సత్కాలక్షేపాలతో తగ్గించుకొని...
హేళనలను పట్టించుకోక...
తనలోని లోపాలకు
తానే నవ్వుకుని...
ఇతరులకు ఇవ్వడంలో
ఆనందాన్ని అనుభవిస్తూ...
పిల్లాపాపలతో కలిసి ఆడిపాడుతూ...
మనసును అదుపులో ఉంచుకుంటే...
అంతా మనశ్శాంతే...!!!!!!!!
- చంద్రకళ. దీకొండ,
స్కూల్ అసిస్టెంట్,
మల్కాజిగిరి, మేడ్చల్ జిల్లా.