Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గుర్తుంచుకో...
"న స్త్రీ స్వతంత్ర మర్హతి" అన్న చోట
మహిళలకు రక్షణ దొరకదు
గుర్తుంచుకో...
"పరిచర్యాత్మకం కర్మ
శూద్రశ్యాపి స్వభావజం"
అన్న చోట
దళితులకు న్యాయం దక్కదు
గుర్తుంచుకో...
"వేదాక్షర విచారేణ
శూద్రాశ్చండాలతాం వ్రజేత్"
అన్న చోట
ప్రశ్నిస్తే జైల్లో బందించబడి
వెలి వేయబడతావని
గుర్తుంచుకో...
మనువాదం పాలించే చోట
పశువులకు ఉండే విలువ
మనుషులకు ఉండదని.
- దిలీప్.వి
జిల్లా కార్యదర్శి
మనవ హక్కుల వేదిక
ఉమ్మడి వరంగల్ జిల్లా
సెల్: 8464030808