Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సింగీతం సంతోష్ కుమార్
రుద్రారం యెల్లారెడ్డి, కామారెడ్డి
బుచ్చిరాములు, లక్ష్మీనరసమ్మ దంపతుల పుత్రుడు!
జానపద కళాకారుడు, తెలంగాణ విమోచనోద్యమకారుడు, గాయకుడు!!
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ఒక చేత్తో పెన్ను!
మరో చేత్తో గన్ను పట్టి తన మాట, ఆట, పాటలతో ఊపిరులూదిన ప్రజాకవి!!
పాటలు రాస్తూ, పాడుతూ, ప్రజలను చైతన్యపరుస్తూ!
కవిగా, కళాకారుడిగా!! ఉద్యమనేతగా తన కలాన్ని, గళాన్ని వినిపించిన మహాకవి...
తెలంగాణ గ్రామసీమల్లో విస్తరిస్తున్న దుర్భర దారిద్ర్యాన్ని, పేదరికాన్ని!
శ్రమ దోపిడీని వెట్టిచాకిరి మంటల్లో కరిగిపోతున్న బాల్యాన్ని !!
' పల్లెటూరి పిల్లగాడా' అనే పాటలో సుద్దాల హనుమంతు
అత్యంత కరుణ రసాత్మకంగా, కళాత్మకంగా చిత్రించి!
ప్రజల హృదయాలో నిలిన ఉద్యమ గాత్రం...
'ఈ భూమి మనదిరా.. ఈ నేల మనదిరా' అంటూ
ఈ నిజాం ఎవడురా అంటూ జనాన్ని జాగృతం చేసిన ప్రజాకవి !!
కవిగా, కళాకారుడిగా తన జీవితాన్ని కష్ట జీవుల కోసం అంకింతం చేసిన గొప్ప కవి....