Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎవరికి కనిపించని
ఓ శిల్పి కాలంలో తిరుగుతూ ...
నిత్యం ఓ విచిత్రమైన ఉలితో ..
చెక్కుతున్నాడు..!!
ఈ భూమి పై వచ్చే
ప్రతి జీవిని చెక్కి
ప్రాణం పోసి ఈనేలపై
నిలబెట్టుచున్నాడు..!!
అక్షరం ముక్కతెలియని వాడిగా..
ఓ నిరక్షరాస్యుడుగా..
ఓ అమాయక శిల్పి...
కానీ.. అతడొక అంతర్యామి
చూపులోనే సమస్తం ఇమిడి ఉంది..!!
ఉలి పట్టగలడు సులువుగా
శిల్పాలు చెక్కగలడు..!!
సమస్త సృష్టికి కర్త కర్మ క్రియ
ఇది కనిపించని ఓ ప్రక్రియ..!!
కనిపించకుండానే..
నిత్యం ఎన్నెన్నో
శిల్పాలను చెక్కి
అమ్మ కడుపులో
నిలుపుతాడు..!!
నెలలు నిండితే తప్ప
నిండైన ఆకారం
ప్రాణం పోసుకోదు..
ఓ అందమైన శిల్పాన్ని
అమ్మ తన కడుపులో
నవ మాసాలు మోసి
పంచభూతాలు కలిగిన
కొత్త జన్మకు పురుడుపోస్తోంది..!!
చీకటి నీడలు చీల్చుకొని
నిండైన ఆకారం
మెండైన కాంతులతో ..
నవ వసంతాలతో...
భూవికి వస్తోంటారు..!!
రక్త మాంసాలతో ..
కండలు పెంచుతోంది..!!
ఇదో కనిపించని
విధి చెక్కిన శిల్పి..!!
ఇది ఎవరు...
ఊహించని ఓ కళ
ఇదో అద్భుత కళా ఖండం..!!
చావు పుట్టుకల పరిచయం
ఈ నేల మీదనే..
జరుగుతుంది..!!
నూతన శిల్పాలకు వేదిక..
కవులకు కళాకారులకు
ఆలంబనగా నిలిచిన
ఓ కొత్త నివేదిక..!!
అందుకే కొత్తగా ఈ భూమిపైకి
వచ్ఛే ప్రతి వ్యకి ఓ కళాకారుడే..!!
కళలపట్ల అభిరుచి
కలిగిన వాడై ఉంటాడు..!!
అంబటి నారాయణ
నిర్మల్
9849326801