Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉన్నట్టుండి కళ్ళముందు కనబడకుండ కనుమరుగైన ఉత్తరమా ఇంతకీ నీ జాడెక్కడా?
ఇంతకాలం మరచిపోలేని
అనుభూతులను పంచి
పెట్టిన నీకోసం వొళ్ళంతా కండ్లు చేసుకొని తిరిగొస్తావని
ఎదురుచూస్తున్నా
కాలరెగరేస్తున్న నేటికాలర్ ట్యూన్ గద్దలా మారి నిన్ను కాలదన్నుకు పోయింది నిజమన్న మాటే కదా?
అందుకే అనుకుంటా
ఇపుడు పోస్ట్ అనే పొలికేక మా వీధి మూలమలుపు చివరనే రాకుండా అక్కడే ఆగిపోయింది
అత్యవసర సమాచారాన్ని అందించేందుకు వచ్చే టెలిగ్రామ్ ఎందుకో రావడంలేదిప్పుడు?
మాటిమాటికి వినిపించే
ఫోన్ కాల్ వాటి స్థానాన్ని
జరిపి బలవంతంగ ఆక్రమించింది
నేడు మనుషుల మధ్య జోరుగా కొనసాగుతున్న వ్యాపారా లావాదేవీలు ఆగడం లేదు
అందుకే కాబోలు వేగంగా చేరేందుకు మనీఆర్డర్ అనే మాటకు అర్థాన్ని మార్చేసి గూగుల్ పే ఊపందుకుంది
రోజురోజుకూ పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో నిత్యం ఆనందాన్నిచ్చే పావురాలవంటి
ఉత్తరాలు ఎందుకో కనబడకుండా అంతరించి పోతున్నాయి
అందుకనే రోజురోజుకి చిక్కిపోతున్న
వాటి ఉనికిని కాపాడేందు మనమే తిరిగి భాద్యత తీసుకొని బతికించాలి!!
-జవేరియా
9849931255