Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వారసత్వ పోరు
మూఢనమ్మకం జోరు
ఆడపిల్ల అనే
అభద్రతా భావంతో
లింగ నిర్ధారణ పరీక్షల
పేరుతో !!
కడుపులోని పిండానికి
కడుపులోనే విచ్ఛిన్నం
చేస్తున్నారు
తమకు జన్మనిచ్చింది
అమ్మే నని
జీవితాన్ని పంచింది
స్త్రీనేనని!!
సృష్టికి మూలం మహిళేనని
ఇంట్లో దీపం వెలిగించి
వెలుగును పంచేది మగువేనని
తెలుసుకో !!
భ్రూణ హత్యలు ఆపకపోతే
ఇలాగే కొనసాగితే
మనుషుల మనుగడకే ముప్పు
ఆడపిల్లలకు జన్మంనిద్దాం
సృష్టి మనుగడను కొనసాగిద్దాం !!!
సబ్బు నాగయ్య ప్రజాకవి
రాజుపేట