Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కవిత్వం ఓ చెట్టుకు
పూసిన పువ్వు కాదు...
ఓ చెట్టుకు కాసిన కాయకాదు..
దొరికే వస్తువు కాదు..!!
ఒక దగ్గర దొంగిలించే సరుకు కాదు..!!
గుచ్చిన ముళ్ళు నొప్పినుంచి..!!
విచ్చుకునే స్నేహ..
పరిమళము నుంచి..!!
గాయల గాధల నుంచి..
బాధించే బతుకుల నుంచి..!!
నిరంతరం తపించే ..
నిశ్శబ్ద జీవితాల నుంచి..!!
పైశాచిక కృత్యాల నుంచి..
పాడే కోకిల స్వరం నుంచి..
కవిత్వం పుట్టుకొస్తోంది..!!
మథన పడే..
మనసుకు పూసే పువ్వు..
వేదనలు నిండిన
గుండెకు కాసిన కాయ..!!
అప్పుడప్పుడు వలపుతో
అల్లుకోనే లతలోనుంచి..
విరబూసే ప్రకృతి..
సోయగాలనుంచి..
కవిత్వం పుడుతోంది..!!
దీని పుట్టుక
ఓ అంతరంగమధనం..!!
దీని ప్రభావం
ఓ మానవీయతకు మార్గం..!!
మెదడును మేస్తోంది..!!
కెరటలై లేస్తోంది..!!
ఇదో చేరగని జ్ఞాపకం..
ఉన్మాదం వచ్చిన..
ఉద్వేగం వచ్చిన..
కనబడని భావమే..
ఎప్పటికి అంతరించి పోనిది..!!
ఆగిపోని నడక కవిత్వానిది..
సాగిపోయే చైతన్యమే..
వీక్షించే ఓ ప్రభాకరుడు..!!
ప్రకాశించే శుభకారుడు
సర్వ జగత్తును సౌమ్యంగా
సుకుమారంగా స్పర్శిస్తోంది..!!
తరతరాలు జనావాళికి
స్ఫూర్తిగా నిలబడుతుంది..!!
కవిత్వం పూసేదికాదు
కాసేది కాదు పరిమళించేది..!!
అజ్ఞాన చీకటిలో
జ్ఞానవెలుగవుతోంది..!!
జీవితాల అర్తాలకు..
పరమార్తమై నిలబడుతుంది..!!
అంబటి నారాయణ
నిర్మల్
9849326801