Authorization
Mon Jan 19, 2015 06:51 pm
"మిస్సైల్ మాన్"
కలాం! మీకు సలాం!
భారతదేశపు 11వ రాష్ట్రపతి..
ఆకాశంలో విహరించాలని కలలుగని
వాటిని సాకారం చేసుకున్న
స్వాప్నిక మేధావి!
భరతమాత మోముపై విరిసిన చిరు ధరహాసపు
సమ్మోహనాస్త్రుడు!
నిరుపేద కుటుంబంలో పుట్టిన క్షిపణివీరుడు!
ధనుష్ కోటి.. రామేశ్వరపుముద్దుబిడ్డ!
పేపర్ బాయ్ నుండి
ప్రెసిడెంట్ వరకు ఎదిగిన
నిరంతర శ్రామిక మేధావి!
భారతదేశాన్ని అణ్వస్త్రరాజ్యాల సరసన చేర్చిన
"మిస్సైల్ మాన్ ""ఆఫ్ ఇండియా!"
"తనఆత్మకథ .. వింగ్స్ ఆఫ్ ఫైర్ "ద్వారా
నిద్రాణంగా ఉన్నయువతను
మేల్కొలిపిన.. చైతన్య శీలి!
విద్యార్థుల భవిత కై
కలలు కనండి-వాటిని సాకారం చేసుకోండి..
అని.. కలలు కనడం నేర్పిన
సృజనాత్మక శీలి!
ప్రపంచంలో ఎన్ని వృత్తులున్నా..
అన్ని వృత్తుల ను తయారు చేసేది..
కేవలం ఉపాధ్యాయ వృత్తి మాత్రమే అని..
గౌరవించిన అధ్యాపక మేధావి!
ప్రోఖ్రాన్ అణు పరీక్షలలో..
బాలిస్టిక్ క్షిపణి, వాహన ప్రయోగ సాంకేతికాభివృద్ధి లో పాటుపడిన.. క్షిపణి వీరుడు!
ఇండియా-2020.. అనే రచన ద్వారా.. 20 20 నాటికి భారతదేశాన్ని..
అభివృద్ధిచెందిన దేశంగా మార్చడానికి ప్రణాళికలు వేసిన పద్మ భూషణుడు!
ఎన్నో..ఎన్నెన్నో..యూనివర్సిటీల నుండి గౌరవడాక్టరేట్లను అందుకున్న
భారతరత్న మా.. అరిషడ్వర్గాలను జయించిన స్వాతిముత్యమా!
ఇగ్నైటెడ్ మైండ్స్.. ఇండియా మై డ్రీమ్
వంటి ఎన్నో పుస్తకాలను రచించిన కవన కుసుమమా!
అబ్దుల్ కలాం.. బ్రహ్మచారి
శాఖాహారి.. మిస్సైల్ వీరుడా..
కలాం.. అందుకోండి నా సలాం
- తిరునగరి పద్మ.