Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అనకాపల్లిలో జన్మించి
రాజమహేంద్రవరంలో నాట్యశిక్షణ ఆరంభించి
మద్రాసులో పన్నెండేళ్ళు
వెంపటి చైనా సత్యం వద్ద
కూచిపూడి నృత్యం నేర్చుకొని
దేశవిదేశాల్లో వేలాది ప్రదర్శనలు ప్రదర్శించి
కూచిపూడి ఆర్ట్స్ ఆకాడమిని స్థాపించి
వెయికిపైగా స్వదేశీ, విదేశీ విద్యార్థులకు
కూచిపూడి నృత్యాన్ని నేర్పి
భారతీయ సంస్కృతి సంప్రదాయాలను విదేశాల్లో విస్తరింపచేస్తూ
కళామతల్లి ముద్దుబిడ్డ యై
ప్రపంచదేశాల్లో కూచిపూడి నృత్య ప్రశాస్త్యానికి
వన్నె తెచ్చిన నాట్యమయూరి శోభానాయుడు!
విభిన్న నాయికా నాయికల పాత్రలను పోషించి
తన నతనావైభవాన్ని చాటుకున్న విదూషిమని
శోభానాయుడు!
ధన సంపాదన ను ప్రక్కకునెట్టి
కళాసేవకు జీవితాన్ని అంకితమిచ్చి
నతరాజుసేవలో పునితురాలైన
పుణ్యాత్మురాలు శోభానాయుడు!
దేవేంద్రుని సభలో ఆస్థాన నర్తకిగా పదోన్నతిపై
స్వర్గానికేగిన నృత్యతారామనికి
అర్పిద్దాం నృత్యాభి నివాళులు!
(కూచిపూడి నృత్యమహారాని కట్టే శోభానాయుడు మృతికి నివాళులర్పిస్తూ....)
- ఆళ్ల నాగేశ్వరరావు
నాజారుపేట, తెనాలి
7416638823.