Authorization
Mon Jan 19, 2015 06:51 pm
1931 అక్టోబర్ 15న రామేశ్వరంలో అబ్దుల్ కలాం జన్మించాడు. తల్లి ఆశియమ్మ తండ్రి జైనులాబ్దిన్ కలాం అసలు పేరు అవుల్ పకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం విజయం సాధించడం అంటే మీ సంతకం ఆటోగ్రాఫ్ గా మారటం అన్న కలాం భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు, ఆధునిక విజ్ఞానానికి, సాంకేతిక పరిజ్ఞానానికి, అంతరిక్ష రంగానికి పర్యాయపదం..
తిరుచిరాపల్లి సెయింట్ జోసెఫ్ కళాశాలలో భౌతిక శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు. ఐఐటీ మద్రాస్ నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో పట్టా పొందారు.బాల్యంలో తన తల్లి ప్రభావంతో ఇంటి పరిస్థితులను అర్థం చేసుకుని అందుకు తగ్గట్టుగా ఇంటింటికి దిన పత్రికలను పంచేవాడు. ఆ డబ్బులు అమ్మకు ఇచ్చేవాడు. ఎన్నో కష్టాలు పడి తన చదువును కొనసాగించినవాడు కలాం. మనిషికి కష్టాలు ఎందుకు కావాలంటే అవి అతనికి విజయాన్ని ఆనందించే మనస్సును ఇస్తాయి. అన్న కలాం యొక్క సానుకూల దృక్పథం తరతరాలకు అనుసరణీయం,ఆచరణీయం. యుద్ధ పైలెట్ కావాలనే కల తృటిలో కోల్పోవటం కలాంకు బాధ కలిగించినప్పటికి ఆ క్షణం భారతదేశానికి ఒక రత్నాన్ని బహుమతిగా ఇచ్చింది. ఆ తర్వాత కలాం జీవితం ప్రపంచాన్ని ప్రభావితం చేసే చరిత్రగా మారింది. జయప్రదమైన జీవితాన్ని జీవించడానికి అవసరమైనదంత మనిషి మనసు లోనే ఉంది. 1960లో డి ఆర్ డి ఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్లో ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఏ డి ఏ శాస్త్రవేత్త గా చేరాడు. భారత సైన్యం కోసం ఒక చిన్న హెలికాప్టర్ చేయడం ద్వారా తన దేశ సేవ ప్రారంభించాడు.
1969లో ఇస్రో లో చేరిన కలాం భారత అంతరిక్ష రంగంలో నూతన సంచలనాలకు కేంద్రబిందువు అయ్యాడు .పి.యస్.యల్.వి 3 ప్రయోగానికి డైరెక్టర్ గా ప్రస్తానం ప్రారంభించి రోహిణి, అగ్ని,పి.యస్.యల్.వి, జి.యస్.యల్.వి ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించడంలో కీలక పాత్ర పోషించారు. 1970 - 1990ల మధ్య కాలంలో భారతదేశ అంతరిక్ష రంగ ప్రయోగాలు ప్రపంచాన్ని విస్మయానికి గురిచేశాయి అంటే దానికి ప్రధాన కారణం ఏపీజే అబ్దుల్ కలాం.
1992 నుండి 1999 వరకు ప్రధాన మంత్రి ముఖ్య శాస్త్రీయ సలహాదారుగా పనిచేశారు. .వాజపేయి ప్రధానమంత్రిగా పని చేసిన కాలంలో పోక్రాన్ 2 అణు పరీక్షలను అత్యంత రహస్యంగా నిర్వహించి భారతదేశ శక్తిని ప్రపంచానికి తెలియజేశారు. కలామ్ శాకాహారి మద్యపాన వ్యతిరేకి,బ్రహ్మచారి కుటుంబం అనేది అభివృద్ధికి ఆటంకం కాకూడదు అంటారు కలాం .కలాం ఖురాన్ తో పాటు భగవద్గీతను కూడా పఠించేవారు .తన ప్రసంగంలో తిరుక్కురళ్ లోని ఏదో ఒక పాశురాన్ని ఖచ్చితంగా ఆయనలోని లోతైన తాత్విక చింతన ను ఇది తెలియజేస్తుంది. జీవితం నీకు విజయాలను అందించదు కేవలం అవకాశాలను ఇస్తుంది అవకాశాలను విజయాలుగా మార్చుకునే శక్తి నీ చేతుల్లో ఉంటుందిఁ.
తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని దేశ అభివృద్ధిలో మైలురాళ్లుగా మరిచిన అపురూప శిల్పి కలాం.
1981లో పద్మభూషణ్ 1990లో పద్మవిభూషణ్ 1997లో భారతరత్న పురస్కారాలను అందించడం దేశం తనను తాను గౌరవించుకుంది. ఏ రాజకీయ వాసనలు లేని కలాంను అన్ని రాజకీయ పార్టీలు కలిసి రాష్ట్రపతిగా ఎన్నుకోవడం దేశ గమనంలో ఆయన స్థానం ఎంత బలమైనదో తెలుపుతుంది .
తాను ఏ వృత్తిలో పని చేసినప్పటికీ అధ్యాపకునిగా తరగతి గదిలో విద్యార్థుల మధ్య గడిపిన క్షణాలు అమూల్యమైనవని చెప్పేవారు .
శాస్త్రవేత్తగా కలాం హృద్రోగులకు కోసం కలాం స్టంట్, వికలాంగుల కోసం పోలియో వ్యాధి గ్రస్తుల కోసం ఆర్థో కాలిపర్స్ కనుగొనడం ద్వారా తన జీవితాన్ని సార్ధకం చేసుకోగలిగాను అని చెప్పారు. ఒక విజేత ఆత్మకథ,నా జీవన గమనం, నా దేశ యువజనులారా, ఈ మొక్కలు వికసిస్తాయి, భారతదేశ శక్తి,ఎవరికీ తలవంచకు, ఇండియా 2020 మొదలైన పుస్తకాలను రచించి తన జీవిత సారాన్నంతా ప్రపంచానికి పంచారు. తాను అభివృద్ధి చేసిన శాస్త్రం సాంకేతిక పరిజ్ఞానాన్ని,అంతరిక్ష విజ్ఞానాన్ని,అణు కార్యక్రమాన్ని ప్రపంచంలో బలీయమైన శక్తిగా నిర్మించబడిన భారతదేశం గురించి జీవితమంతా పర్యటించి యువతకు బాలలకు వివరించారు కలాం .
2015 జూలై 27న షిల్లాంగ్ లో తనకెంతో ఇష్టమైన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూనే గుండెపోటుతో చివరి శ్వాస విడవడం యాదృచ్ఛికం. కర్మయోగి నిష్కళంక ఋషి, భరతమాత ప్రియమైన పుత్రుడు అబ్దుల్ కలాం మరణించిన సందర్భంలో ప్రపంచంలోని ప్రతి వ్యక్తి తమ ఆత్మీయుడిని కోల్పోయినట్టే భావించి కన్నీటితో నివాళులు అర్పించటం మహాద్భుత దృశ్యం. ప్రపంచాన్ని అన్ని రంగాలలో శాసించే ప్రచండ శక్తిగా భారతదేశాన్ని చూడాలనుకున్న ఆయన ఆశయాన్ని కొనసాగించడమే ఆయనకు మనం ఇచ్చే ఘనమైన నివాళి .
- అట్లూరి వెంకటరమణ
అధ్యాపకుడు కవి రచయిత
9550776152