Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సామాన్యుడు, సాధకుడు తనో బోధకుడు..
కల, కృషితో అసాధ్యం అనేది లేదన్నాడు..
యువతకు స్ఫూర్తి అనే ఇంధనాన్ని నింపాడు..
పినాకిని నుండి అగ్ని వరకు భరత సత్తాను చాటాడు..
అజాత శత్రువు, విమర్శ లేని ఉన్నత వ్యక్తియుడు..
నిరంతర శ్రమతో మువ్వన్నెల జెండా ఖ్యాతిని పెంచాడు..
ఊహలకు ప్రాణం పోసి పక్షిలా ఎగరాలన్నాడు..
గర్వాన్ని ఆమడ దూరంలో పెట్టిన నిర్మల మనస్కుడు..
మోము పై చిరునవ్వునే ఆభరణంగా ధరించినవాడు..
సమాజమే నా కుటుంబం సేవయే నా మార్గం అన్న నిత్య శోధకుడు..
అంచెలంచెలుగా ఎదిగిన ఒదిగి ఉండటమే నీ వ్యక్తిత్వానికి నిదర్శనం అన్నాడు..
విద్యార్థులతో మమేకమే తనకు ఆనంద సమయం అన్నాడు..
నిత్య పఠనమే నీ జ్ఞాన సముపార్జనకి మార్గమన్నాడు..
ఉడుకు రక్తం ఉరకలెత్తిస్తూ విజయ తీరాన్ని చేరాలన్నాడు..
చమట చుక్కని చిందిస్తూ చరిత్రలో చెరగని ముద్రవేయమన్నాడు..
వార్త పత్రికలు పంచినోడు నిత్యం తనో వార్తగా ఎదిగాడు..
ఉన్నత పదవికి వన్నె తెచ్చిన భారతరత్న..
జాతి గుండెల్లో సజీవంగా నిలిచిన పద్మభూషణ్..
గతి తప్పిన గాడి తప్పిన యువతని సన్మార్గంలో నడిపే ఆరాధ్యుడు..
రచన:- మహేష్ వేల్పుల
తొండ, తిరుమలగిరి, సూర్యాపేట
9951879504