Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అబ్దుల్ కలామ్ రామేశ్వరంలో జైనులుద్దిన్, ఆయుషమ్మ దంపతుల పుత్రుడు!
అత్యున్నత పదవిలోనూ నిరాండబరమైన జీవితాన్ని గడిపిన ధీరుడు!!
శాస్త్ర సాంకేతిక పరిశోధకునిగా, ప్రజా రాష్ట్రపతిగా!
విద్యార్థులకు మార్గనిర్దేశకునిగా!!
రచయితగా,అసమాన ప్రతిభా పాటవాలు చూపిన మహోన్నత వ్యక్తి!
భారతదేశ సాంకేతిక సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన అసామాన్య ప్రజ్ఞాశాలి!!
"ఎంత ఎదిగినా ఒదిగి"
ఉండాలనే ఆయన స్వభావం ఎందరికో మార్గనిర్దేశం!
‘కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి’ అని చెప్పి!!
యువతలో ఆత్మవిశ్వాసం నింపిన చైతన్య పరుడు!
అగ్ని, పృథ్వీ వంటి ఎన్నో క్షిపణులు ఆయన ఆధ్వర్యంలోనే నింగిలోకి దూసుకెళ్లి!!
అంతరిక్ష పరిశోధనల్లో భారత్కు ఎన్నో విజయాలు అందించిన మేధావి!
ప్రధాన మంత్రి శాస్త్రీయ సలహాదారుగా,రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ,ముఖ్యకార్యదర్శిగానూ సేవలందించి!!
పోఖ్రాన్ అణు పరీక్షల్లో కీలక పాత్ర పోషించిన మహనీయుడు!
జీవితం గడిపి
నిరంతర కృషీవలుణ్ని దేశ అత్యుత్తమ పురస్కారం ‘భారతరత్న’ సహా ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వరించాయి!!
ఐక్యరాజ్య సమితి సైతం కలాం జన్మదినోత్సవాన్ని అంతర్జాతీయ విద్యార్థి దినోత్సవంగా ప్రకటించి!
మధ్యతరగతి కుటుంబంలో జన్మించి!!
విజయాలను తన వందల కోట్ల మందికి విజయ రహస్యాన్ని బోధించిన స్ఫూర్తి ప్రదాత......
-సింగీతం సంతోష్ కుమార్
రుద్రారం, యెల్లారెడ్డి, కామారెడ్డి