Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పుట్టింది పేదరికంలో
పెరిగింది పల్లెటూరిలో
జ్ఞాన సముపార్జనలో
అలుపులేనితనం
గురువుల మనసులో
ఆయన స్థానం ఉన్నతం
ఆయన కలలకు ఆకాశమే హద్దు
పక్షిలా ఎగరలనే చిన్ననాడే బీజంవేసుకున్న స్వాప్నికుడు
చదువులో అందరికంటే ముందుండేవాడు
పేదరికాన్ని తన జ్ఞానంతో తరిమిన జ్ఞానశీలుడు
గురువులను మరవక గుండెనిండెంపుకుని
తన ఆత్మకథలో వారిని పేరుపేరునా మన ముందుంచాడు
అదే వినయశీలతను లోకానికి చాటాడు
తన చదువు తనను ప్రపంచానికి పరిచయం చేసింది
తన జ్ఞానం దేశానికే అంకితం చేసి
చివరివరకు తన బతుకునంతా ధారపోసిన త్యాగశీలి
జ్ఞానం సంపాదించడమే కాదు దాన్నెందరికో పంచిన
మహనీయుడు మంచివ్యక్తి
తన జీవితమే ప్రేరణగా
ఆదర్శం అయ్యాడు
సరస్వతి పుత్రుడు
దేశభక్తుడు
విశ్వంలో దేశ ఘనతను నిలిపిన మిస్సైల్ వీరుడు
- సి. శేఖర్,
పాలమూరు,
9010480557