Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నేటి తరం చూసిన మహర్షి
ఇల నడయాడిన మహా మనీషి
అతడే భారత రత్న అబ్దుల్ కలాం
అణ్వస్త్ర క్షిపణి వ్యవస్థకు
రూపులద్దిన "మిస్సైల్" మ్యాన్
భారత "ప్రథమ" పౌరునిగా
పదవికి వన్నెలద్దిన "వెన్నెల" రేడు
కలలు కనండంటూ ...
యువతకు "ప్రేరణ"నిచ్చిన
నిలువెత్తు నిబ్బర "శిఖరం"
కోట్లాది మందికి మార్గదర్శి
ప్రపంచ మానవాళికి తేజశ్వి
దేశం ప్రగతి పథంలో నడవాలని
ఆకాంక్షించిన నిత్య స్వాప్నికుడు
అడుగుపెట్టిన అన్ని రంగాల్లోనూ
పరిపూర్ణత సాధించిన విశిష్ట వ్యక్తి
తను నమ్మిన సిద్ధాంతాన్ని ఆచరిస్తూ
ఆదర్శ ప్రాయమై నిలిచిన ప్రభావితుడు
తాను అడుగిడిన అన్ని రంగాల్లో
పరిపూర్ణత సాధించిన విశిష్ట విజయుడు
తొలి ప్రస్థానం నుండి తుది శ్వాస దాకా ...
విలువల బాటలో అడుగులేసిన యాత్రికుడు
అబ్దుల్ కలాం
నిత్య శోధితుడు
అవిశ్రాంత శ్రామికుడు
దేశం నచ్చిన సకల శాస్త్ర నిపుణ కౌశలుడు
ప్రపంచం మెచ్చిన సంపూర్ణ మూర్తిమత్యుడు
అద్భుత జ్ఞాన సంపన్నుడా ...
ఆనంతానంతా శక్తిమంతుడా ..
ఆదర్శప్రాయ అబ్దుల కలాం ..!
మానవాళి నీ నామమే జపిస్తుంది
నీ ఆశయ బాటన సాగ పూనుకుంది
జయహో….అబ్దుల్ కలాం
జయ జయహో మిస్సైల్ మ్యాన్
- కోడిగూటి తిరుపతి
9573929493