Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రకృతి కోపించింది.. విలయ తాండవం సృష్టిస్తోంది!
కరోనా విజృంబణ నుంచి నేటికీ బలవుతున్న జనం
దారి తెన్నూ తెలియక ఇళ్ళల్లోనే దాక్కున్నజనం .
సాగరాన మొదలయిన వాయు గుండం
వరదలతో ముంచెత్తిన నగరాలు
నీరు ఎక్కడ చూసినా నీరే
కానీ తాగునీరు లేక జనం అల్లాడే జనం
గూడు గుడ్డా సర్వం కోల్పోయిన జనం
తినటానికి తిండి గింజలు లేవు
కూరగాయపంటలు నీటి పాలు
ధాన్యపు పంటలన్నీనీట మునిగే
కళ్లెంలోని నీరు చూసి రైతుల కంట నీరే
మానవ మనుగడ నీటిలోనే
పుడమి తల్లి గర్భాన దాగిన జల ప్రళయానికి
ఫెళ్ళున ఎగిరి వానతో పాటు జనం మధ్య
సహజీవులైన పాములు, చేపలు, మొసళ్ళు, పీతలు,
వాటిని చూచి భయ భ్రాంతులైన జనాల గుండెలు.
ఇంటా బయటా నీరే ఎటునుంచి ప్రమాదామో తెలీని జనం
రోడ్లు, రైలు పట్టాలు నీటి ప్రవాహానికి కోతకు గురి
వరుణుడి పాశాయుధానికి బలయిన జనం
నిండిన జలాశయాలు తెరిచిన గేట్లు
అస్తవ్యస్తమైన సామాన్యుడి జీవనం..
అటు కరోనా ఇటు వాయుగండం
జల గండంలో భీతిల్లిన జనం గుండె ..
- మణి కోపల్లె
9703044410