Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఓ సంచలనాన్ని
సృష్టించడానికి..
నిరంతరం సంచరిస్తూ..
తన గుండెను ఛేదిస్తూ...
మనసు పొరలను మీటుతూ..
ఆలోచనలోనే
ఒదిగిపోయేవాడు...
కుదురుగా కూర్చోని..
కొత్త రూపానికి..
సాన బెట్టేవాడు..
ఎంతెంత ఎత్తులో ఉన్న
ఒడుపుతో..ఓర్పుతో
అందుకునే వాడు..
అంతగొప్ప నేర్పరి.. కలాం..!!
తన మనోక్షేత్రం ఓ అద్భుతమైన
ఆలోచననల తోట..!!
కొత్త నడకలకు.. కొత్త పోకడలకు..
మనో భావాలకు..
ఓ విన్నూత్న ప్రయోగ శాల!!
తన వివేకంతో ..
వైజ్ఞానిక విశ్వాన్ని జయించి
దేశానికే కీర్తి కిరీటాన్ని ..
పెట్టిన ఘనుడు కలాం..!!
భవితను తీర్చి దిద్ది
భవిష్యత్ కు
కొత్తతోవ చూపిన వ్యక్తి..!!
అతడొక అధికార
ఆహంకారం లేని..
ఓ భారత రత్నం..!!
కలాం ఓ.. అద్భుత భావ జాలం..
ఆయనలోని తాత్విక శక్తి..
ఆలోచన యుక్తి.. విజ్ఞాన సృష్టి..
దేశానికే ఓ వైజ్ఞానిక పరిపుష్టి..!!
కుల మతాలు లేని
ఓ మానవతావాది..
కలలను సాకారం
చేసుకొన్న సాధకుడు..!!
అందరిలో ఆత్మీయ సదృశ్యమై ..
నిలిచిన ఘనుడు..!!
కలాం...!! దేశమే
నీకు చేస్తోంది నిండు సలాం..!!
యావత్తు భారతజాతీ.. నీకెప్పటికీ ఋణపడే ఉంటుంది...కలకాలం!!
అంబటి నారాయణ
నిర్మల్
9849326801