Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమ్మా !
ఓ న్యాయదేవతా!
మీ చెవులు మూశారు
మీ కళ్ళు మూశారు
మా గొంతులు నులిమారు
మా నాలుకలు కోశారు
మీకు వినపడదు కనపడదు
మేము గొంతువిప్పి మాట్లాడలేము
కాని, లక్షలగొంతులు హాథ్రాస్ లో
దళిత బాలిక మనీషా వాల్మీకిపై
జరిగిన ఆ దారుణమైన అమానుష
అకృత్యాలకు వ్యతిరేకంగా
నిరసన జ్వాలలు రేగినా
ఊరూర ఉద్యమాలతో ధర్నాలతో
దేశమంతా ద్దరిల్లినా
అంతా అరణ్యరోదనే అయింది
అగ్రవర్ణాలదే పైచేయి అయింది
అత్యాచారాలే జరగలేదంటున్నారు
ఇదెక్కడి న్యాయం ? తల్లీ?
ఇదెక్కడి ఘోరం ? ఇదెక్కడి ధర్మం?
"నాలుగు పులులు" ఒక
అమాయకపు జింకను
ఎందుకు వేటాడుతాయి?
రక్తం త్రాగడానికే కదా !
వెంటబడి వెంటబడి
ఎందుకు సంహరిస్తాయి?
ఆకలి తీర్చుకోవడానికే గదా !
ఆ పులుల నోట రక్తం కారుతున్నా
గుట్టలుగాఎముకలక్కడే పడివున్నా
"గుంటనక్కలు" కొన్ని గుర్తులేమీలేవని
అసలక్కడ ఏ దారుణం జరగలేదని
పాపం పులులు ఏ పాపం ఎరగవని
వేటగాడెవరో జింకను బాణం వేసి
ప్రాణం తీశాడని రిపోర్టు లిచ్చేస్తున్నాయి.........
హాథ్రాస్ లోనూ అదే "మృగనీతి"
"అర్థరాత్రిలో అంత్యక్రియలు"
"అత్యాచారం జరగలేదని రిపోర్టులు"
ఛీ ! ఛీ ! వీరు అధికారులా? కాదు కాదు
"ఊసరవెల్లులు"..."మేకవన్య పులులు"...
"తేనెపూసిన కత్తులు."ప్రభుత్వానికి తొత్తులు."..
నిజమే నిర్భయలాంటి చట్టాలెన్ని చేసిలాభమేమి?
రాజ్యాంగం హక్కులెన్ని కల్పించి లాభమేమి?
కామాంధుల విషపుకోరలను విరిచేందుకు, చక్కని
మార్గమొక్కటే "నైజీరియా ప్రభుత్వ విధానం"
"దోషుల పురుషత్వాన్ని తక్షణం తొలిగించడమే"....
"చచ్చేంత వరకు వారు జీవశ్చవాల్లా బ్రతకడమే......
అట్టి చట్టమే స్త్రీ జాతికి శ్రీరామరక్ష...
అదే కామాంధులకు అసలైన సిసలైనశిక్ష...
- పోలయ్య కవి కూకట్లపల్లి
హైదరాబాద్ - 9110784502