Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎప్పుడూ కష్టాలలో మునిగితేలుతున్న
ఈ పేదవారి బ్రతుకులో
నవరాత్రులైనా సంతోషాన్ని
వెదజిల్లే బంగారు తల్లివమ్మ బతుకమ్మ......
పిల్లలు, పెద్దలు అందరు కలిసి
కిలకిల నవ్వులతో ,ఘల్లు ఘల్లుమనే
గాజుల చప్పుడుతో ,
ముఖము నుండి దివ్యకాంతులు
వెదజల్లగా,అంగరంగ వైభవంగా
ఎంతో సంతోషంగా మనసారా
కొలుచుకునే దైవం నీవు బతుకమ్మ.......
తంగేడు, గునుగు, గుమ్మాడి,
గులాబీ, చేమంతులతో అందంగా
రూపుదిద్దుకున్న రూపం నీవు బతుకమ్మ.....
పల్లె పల్లెనా, వాడ వాడనా,
గడప గడపనా నీ నామమే,
మహిళలందరు భక్తితో,చిత్తశుద్ధితో
పూజింపబడే గౌరమ్మవే నీవు బతుకమ్మ....
-లడె. నిత్య
9550596570