Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణా రాష్ట్ర సంస్కృతి కి ప్రతీక బతుకమ్మ పండుగ.దసరా దేవీ నవరాత్రులు సందర్బంగా ఈ పండుగ ను అత్యంత భక్తి శ్రద్ధలతో తెలంగాణా ప్రాంతం లో చేస్తారు. బాలికలు, స్త్రీలు ఈ వేడుకలు లో ఉత్సాహం గా పాల్గొనడం ఆనవాయితీ. ఈ పండుగ ను పూల పండుగ గా చేస్తారు.బతుకమ్మ ను గౌరీదేవి గా పిలుస్తారు. దసరా పండుగ కు రెండు రోజులకు ముందుగా బతుకమ్మ పండుగ వస్తుంది. ఈ పండుగ ను తెలంగాణా రాష్ట్ర పండుగ గా గుర్తింపు నివ్వడం విశేషం.
సృష్టి లో శక్తి స్వరూపం అమ్మ. ఆమె ఆదిశక్తి పరాశక్తి, ఆమె ఒక దేవత అదేవిధంగా ఈ లోకంలో ప్రతీ ప్రాణికీ అమ్మ ఒక దివ్యశక్తి గా అవతరించి నదని దసరా పండుగ సందర్బంగా బతుకమ్మ లను భక్తి శ్రద్ధలతో పూజిస్తారు.
ముఖ్యం గా తెలంగాణా ప్రాంతం లో బతుకమ్మల పండుగ ను మహిళలు పవిత్ర దేవతలు గా కీర్తించి కొలుస్తారు. మహిళలు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం ఈ బతుకమ్మలు
జనులంతా ఒక్కటే జగమంతా శక్తి స్వరూపం ఒక్కటే అని తెలియ జేసేదే ఈ బతుకమ్మ పండుగ పరమార్థం. బతుకమ్మ లను పూజించే మహిళలు బోనాలు తలపై పెట్టుకుని అమ్మ వారిని బతుకమ్మల రూపం లో వున్న శక్తి మాతను ప్రార్థిస్తారు. ఈ లోకంలో అందరూ చల్లగా ఉండాలని, అందరినీ కాపాడాలని కొలుస్తారు. బతుకమ్మ పూజలు మన సంస్కృతి కి ప్రతిరూపాలు ఈ విశాల విశ్వం ను కాపాడే అమ్మవారు ఆదిశక్తి అవతారం. బతుకమ్మ లు అమ్మవారి అవతారాలు లో ఒక ప్రతిరూపం.
అందుకే తెలంగాణా ప్రాంతం మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో బతుకమ్మ వేడుకలు నిర్వహించడం ఆనవాయితీ.
ప్రతీ ఇంట్లో అందరూ బాగుండాలని, పాడి పంటలు పుష్కలంగా పండాలని, సిరులు పండాలి అని సౌభాగ్యం చేకూరాలని, అందరూ ఆయురారోగ్యాలతో విలసిల్లాలని బతుకమ్మ లను మొక్కుకోవడం ఈ బతుకమ్మ పండుగ లోని పరమార్థం. 'బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు. మాతల్లి ఉయ్యాలో' అని పాటలు పాడుకుంటున్న మహిళలు బోనాలు సమర్పించిన అనంతరం పసుపు, కుంకుమలతో పూజిస్తారు. ఈ పండుగ లో బతుకమ్మ లకు సమర్పించిన నైవేద్యాలు ఇంటిల్లపాది భక్తి శ్రద్ధలతో తీసుకోవాలి. అణగారిన మహిళలు కామాంధుల ఆకృత్యాలతో అట్టుడికి పోతుంటే మమ్మల్ని ఈ బారి నుండి చల్లంగా కాపాడాలని పూర్వ కాలంలో బతుకమ్మ లకు తెలంగాణా మహిళలు మొర పెట్టు కున్నట్లు తెలుస్తోంది. చోళ రాజులు దౌర్జన్యం తో ఇక్కడ వున్న ఒక ఆలయం లో పార్వతి దేవి విగ్రహం అపహరించారని ఇలాంటి విధానాలు నుండి తమను కాపాడాలని కోరుతూ బతుకమ్మ లను పూజించే వారని చెబుతారు.
బతుకమ్మ లను పూజించడం కోసం మహిళలు విశేషం గా బారులు తీరి వుంటారు. ఏడాది కోమారు వచ్చే బతుకమ్మల సంబరాలు తెలంగాణా మహిళా సంస్కృతి కి ఒక మణిదీపం.
బతుకమ్మ పండుగ.మహిళలు అత్యంత భక్తి శ్రద్ధ లతో తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ వేడుకలు నిర్వహించడం ఆచారం. దీనిని సద్దుల పండుగ అనికూడా పిలుస్తారు. గత కొన్ని శతాబ్దాలు గా ఈ వేడుకలు అత్యంత వైభవం గా జరుపడం విశేషం. ముగింపు రోజున బతుకమ్మ లను నదీ ప్రవాహం లో నిమజ్జనం చేస్తారు.
- లక్కరాజు ప్రఫుల్ల చంద్ర
63005 46700.