Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బంగారు పండగ బతుకమ్మ పండుగ
మా ఇంటికొచ్చింది ముద్దుల పండుగ
పెత్తరామస నుండి మహర్నవమి వరుకు
జోరుగా సాగేటి సద్దుల పండుగ.
గునుగు గుమ్మడి పూలు పచ్చతంగేడు పూలు
కాకర కానుగా కురువింద మల్లెలు
పొట్ల పారిజాతం పైడి తంగేడు పూలు
వావిలి యిళ్ళింద పొన్న బీరపూలు
ఎర్ర కట్లపూలు ఏడు లక్షలు తెచ్చి
పచ్చ కట్ల పూలు పది లక్షలు తెచ్చి
చాన చామంతులతోని చేరి కొలుతుము మేము
పార్వతమ్మకు మేము ప్రణమిల్లు తాము.
మా ఊరి మధ్యలో అనుమాండ్ల గుడికాడ
అమ్మలక్కలంతా కూడి ఆడి పాడేరు
చెమ్మ చెక్కలాడి చేరి కొలిచేరు
చెరువును చేరిరా చెలియలంతా గూడి
పోయిరా గౌరమ్మ పోయి రమ్మంటూ
మళ్లీరా బతుకమ్మ మల్లిరమ్మంటూ
పప్పు చెక్కర చూడు పచ్చి కొబ్బరి బెల్లం
మొక్కజొన్న కంకి మలీద ముద్దలు
ఆత్మీయత తోడా అందరికీ పంచిరి
పాట పాడుకుంటూ పల్లె చేరొచ్చిరి.
- - ఆరె.ధనలక్ష్మి
తెలుగు భాషోపొధ్యాయురాలు,
ఖమ్మం పల్లి,
7287985428