Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బతుకమ్మ
బ్రతుకనిచ్చే అమ్మ
తెలంగాణ పట్టుకొమ్మ
ఆడపడచుల కంటిరెమ్మ
తంగేడు పూలు
కోలాటాల తందానాలు
అమ్మలక్కల సంతోషాలు
ఊరురా సంబరాలు
మరువరాని సంస్కృతులు
తరతరాల సంప్రదాయాలు
తొమ్మిది రోజుల ఆటలు
తనివితీరని పాటలు
పల్లె పట్నాలలో వేడుకలు
తెలంగాణ అస్థిత్వానికీ మూలాలు
- ప్రశాంత్
8096106847