Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజకర్ల పై తిరుగుబాటు
నైజాం నవాబ్ పై పోరుబాట
బతుకమ్మ ఆట బతికేందుకు సాగుతున్న ఆట
తెలంగాణ ఉద్యమ సారంగి
ఉరుకులెత్తించి ఇంటి నుంచి కెరటం అయ్యి
సడక్ బందులో ఉద్యమ హోరు పాట అయ్యింది
బతుకమ్మ
బడుగులకు తోడై
హక్కుల సాధనకు ఉథం అయ్యి
కోలాటం పాటై
సింహ ఘర్జనాయి
విమలక్క సంధ్యాక్క
ఎందరో ప్రగతి శీ లురా
అభ్యుదయం కు బాట
చూపిన విప్లవి
మా తెలంగాణ అక్కచెల్లెలు
ధగపడ్డ దోపిడీని తరిమికొట్టేందుకు తెలంగాణ గ్రామీణుల చైతన్య గీతికా అయ్యింది
ఇది ఒక సంస్కృతి పండుగే కాదు
సబ్బండ వర్గాలు ఐక్యం చేసి
తెలంగాణ సాధించిన అజారామం అయిన విప్లవి
నా బతుకమ్మ
-ఉమారాణి వైద్య
అంగన్వాడీ టీచర్
లింగాపూర్, కామారెడ్డి
9000346200