Authorization
Mon Jan 19, 2015 06:51 pm
--- ఓర్సు రాజ్ మానస.
సెల్: 9849446027
చక్కని బతుకమ్మ చిక్కగ పూవులు అమరిస్తేనే
చక్కని చుక్కలు భూవిపై చందంగా వెలిగేది
పూల వసంతాల సరోవర హృద్యo బతుకమ్మ
తంగేడు గునుగు పూలుకట్టి పెరిస్తేనే కదా
గౌరమ్మను పెట్టి ముద్దుగా బొద్దుగా సింగారించేది
సద్దుల బతుకమ్మ సంద్రాల సింగిడిలు పూసేనో
బడి ఒడిలో బతుకమ్మ ఒలలాడుతుంటే
అమ్మఒడిలో సరాగాల కూనిరాగాలు తీస్తుంది
ఇంటింటిలో వెలిగే వెన్నెల కిరణం బతుకమ్మ
కట్ల బతుకమ్మ కనకవర్షం జల్లరాలిస్తేనే
కనకాంబరమై బతుకమ్మ కాంతులీనుతుంది
వాయినాలు ఒలకబోసే అందాలతార బతుకమ్మ
గుమ్మడి పూల బతుకమ్మ గుణమెంతో కదా
గౌరమ్మవై మా గౌరవాన్నినిలిపే అమ్మోరువైనావు
ముత్తైదువల వెలుగుదివ్వేలా కాంతిబతుకమ్మ
బంతిపూల బతుకమ్మ ఇంటికి నగవైరాగానే
చేమంతుల బతుకమ్మ చెలిమి పంచగా వచ్చింది
జాజిపూల బతుకమ్మ జామూరాత్రిల పండగ