Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ అనే పదం తియ్యగానే గుర్తుకు వచ్చే పండుగ బతుకమ్మ ఇది పూల జాతార పల్లెల్లో పెద్దసందడి
బతుకమ్మ పండుగ ఎప్పుడు ప్రారంభం అయ్యింది అని కచ్చితమైన ఆధారాలు లేవు కానీ నైజం నిరంకుశత్వానికి వ్యాతిరేకంగా ప్రారంభం అయినట్లు తెలుస్తుంది. ఇది గిరిజనులు పెళ్లికాని వారు మంచి భర్తలు దోర్కలని చేసే తీజ్ పండుగతో పోలిక ఉంది గర్భో నృత్యం తో పోలి ఉంటుంది గర్భో అంటే గొబ్బి అని అర్థం. పే త్రా అమావాస్య నుండి ఇది ప్రారంభం అవుతుంది. మంచి పంటలు, మంచి భర్త, ఉత్తమ సంతానం కలుగాలని పూలను అమ్మవారిని పూజిడిస్తూ చుట్టు గుముగుడి చప్పట్లు కొడుతూ నడుము వరకు వంగి లయబద్దంగా చప్పట్లు కొడుతూ చుట్టు తిరుగుతూ వాడుతారు
ఇంతకు ముందు చెప్పినట్లు ఇది ఎప్పుడు ప్రారంభం అయిందో కచ్చితంగా చెప్పలేము కానీ తెలంగాణా లో వర్షాలు లేక కరువు కాటకాలతో తీవ్రమైన ఇబ్బంది పడి ఆకలి తో చనిపోయే పరిస్థితి ఉంది అందుకే బతుకు నీవ్వు అమ్మ అంటూ వేడుకుంటు బతుకమ్మ అని ప్రార్థిస్తారు.
మరొక త్యాగమయా చరిత ఉంది ఒక గ్రామంలో చాలా ఏండ్ల తరువాత వానలు పాడి చెరువు కట్టకు గండి పడి పూడ్చడానికి వీలు లేకుండా ఉన్న సమయంలో ఒక కన్నె పిల్ల ఆ గండిలో దూకి తన ప్రాణాలను తీసుకొని గ్రామస్తులను కాపాడింది ఈ విధంగా త్యాగాలు చారిత్రక ,సాంస్కృతిక ఆధారాలతో ఈ పండుగ ప్రారంభం అయినట్టు కథలు ఉన్నాయి.ఇది త్యాగానికి పునాది
బతుకమ్మను ఇత్తది తాంబూలం లేదా గుమ్మడి ఆకుల పైన తంగాడి, గునుక, తోక చామంతి, పట్టుకుచ్చు, కట్ల, పిట్ట కాళీ, ఎర్రగన్నేరు, పచ్చగన్నేరు, రుద్రాక్ష, బీర, గుమ్మడి, బంతి, వరుస వారుసలుగా గ్రామాల్లో పేర్చి తమ దర్పాన్ని ప్రదర్శిస్తారు రంగులు కూడా అద్దుతారు ఈ విధంగా ప్రకృతి పాట్ల మానవునికి ఉండ వాల్సిన బాధ్యతను సంస్కృతిలో భాగంగా చెప్పే పండుగ బతుకమ్మ చివరి రోజు పేర్చే బతుకమ్మ ను సద్దుల బతుకమ్మ లేదా ఎంగిలి బతు కమ్మ లేదా పెద్దబతుకమ్మ అని పిలుస్తారు. మన యసాను భాషను ప్రేమతో కొలమ్మ కోలో, ఉయ్యాలో ఉయ్యాలో అంటూ ఆడపిల్లల బాధలను, అత్తవారింట్లో వారు పాడే సమస్యల ను వెదనగా పేర్కొంటూ పాడుకుంటారు.
పెద్ద బతుకమ్మ పండుగ రోజు ఖచ్చితంగా వారి స్థాయికి తగ్గట్లు పట్టుచీర కట్టుకుంటారు పెళ్ళి కానీ పిల్లలు లంగా ఓనిల తో సాంప్రదాయ దుస్తులు ధరిస్తారు. తెలంగాణలో బతుకమ్మను ఉద్యమల ఊపిరిగా తిరుగు బాటుకు నైపత్యం లో సాగుతున్నాయి .సబ్బండ వర్గాలు పండుగ రోజే కాదు తమ ఆకాంక్షలకు, కోరికలకు సాధనలో బతకమ్మను పేర్చి నిరసన ను తెల్పుతారు.తెలంగాణ ఉద్యమంలో ఇది బాగా కనిపించింది ఒక రకంగా సంస్కృతి మరోప్రక్క హక్కుల సాధనకు వాడుతున్నారు
తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కె. సి.ఆర్ బిడ్డ తెలంగాణ జాగృతి ఏర్పాటు చేసి బతుకమ్మకు ప్రాచుర్యం కల్పించగా ప్రగతి శీలమైన భావాలు కల్గిన విమలక్క, సంధ్యాక్క, వంగపండు కూతురు బడుగుల బతుకమ్మ పేరిట రెండు కోణాల్లో ప్రాచుర్యం లభించింది. గడిలా బతుకమ్మ కాదు బడుగుల బలహీన వర్గాల కుసంబంధించిన బతుకు అమ్మ గా విభజన చేయబడి సాంస్కృతిక పండుగ కు కొంత రాజకీయ రంగు పులుముకుంది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మను రాష్ట్ర పండుగగా, తంగేడు పువ్వును రాష్ట్ర పుష్పంగా పేర్కొనడం బతుకమ్మ చీరలను కూడా పంపిణీ చేసి ఈ పండుగ రాజకీయ లబ్దికి ఒక కొంగు బంగారం అయింది. ప్రకృతి లో పూలను పూజించే పండుగ తెలంగాణ వారి సొంతం అవ్వడం మన తెలంగాణ ప్రజల అదృష్టం మరి ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చింది
తొలి మాలి దశ ఉద్యమాలు అమరుల ఆశయాలకు ఒక స్ఫూర్తిని ఉత్తేజాన్ని ఇస్తుంది.నేటికి పల్లెల్లో అంటరానితనం పేరుతో ఈ ఆటకు దూరం అవుతున్న వారికి ప్రభుత్వ పరంగా కులాల అడ్డు గోడలను తొలిగించి సబ్బండవర్గాలు సామాజిక పునాదుల మీద ఎందరో అమరులు త్యాగాల రక్తం తో శుద్ధి అయిన తెలంగాణ లో బడుగు బలహీన వర్గాల కు న్యాయం కల్పించే సామాజిక తెలంగాణకు ఉథం ఇస్తుంది ఆ దిశగా అడుగులు వెయ్యాలి.
తొమ్మిది రోజుల తర్వాత మోకాళ్ళ లోతు వరకు నీళ్ళల్లోకి దిగి పోయి రావమ్మా తిరిగి రావమ్మా అని వేడుకలు ముగుస్తాయి.
బంగారు తెలంగాణ ఉయ్యాలో
నేను అడగలేదు ఉయ్యాలో
ఆకలి కేకలు లేని ఉయ్యాలో
అందరూ చల్లంగా ఉండాలి ఉయ్యాలో
తెలంగాణ తెచ్చితివి ఉయ్యాలో
పోయి రావమ్మా ఉయ్యాలో
సమతను మమతనూ
పంచేందుకు మళ్ళీ రావమ్మా
అంటూ బతుకు పాటగా వెలుగుతున్న బతుకమ్మ సామాజిక సాంస్కృతిక ప్రతీకగా జనజీవనం చెరగని ముద్రవేసింది అందుకే మన తెలంగాణ బతుకమ్మ కు సముద్రం అంత సారం ఉంది
- ఉమశేషారావు వైద్య
లెక్చరర్ ఇన్ సివిక్స్
జి. జె.సి దోమకొండ
కామారెడ్డి జిల్లా
సెల్.9440408080