Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నీ అంతరాత్మనే..
నీలోని దేవుడు..
నిన్ను నీవే ప్రశ్నించుకో!..
నీలో నీవే దర్శించుకో!..
నీలోనే నువ్వు వెలిగించుకో!..
నీలోని నిజమే నీకు
నిజమైన దేవుడుగా
సాక్షాత్కరిస్తుంది!..
ఏ దేవుడికీ మొర పెట్టుకోకు!..
నీ మొర ఆలకించే
వారెవ్వరూ లేరిక్కడ!..
మనుష్యులుగా మసలడమే మరిచాముగా!...
నేరం ఒక్కరిదైతే శిక్ష
మరొక్కరికి కాకూడదు!...
నీ మనోనేత్రంతో
నిజనిజాలను పరికించు!..
నీ దుఃఖాశ్రువులకు కారణాలేవో
నిగ్గదీసి ప్రశ్నించు!..
ఎన్నిఅగాధాలను దాటేశావో!...
ఎన్ని మలుపులను అధిగమించావో!...
పోగొట్టుకొన్నదేదో గమనించుకో!..
నీ స్వార్థపు ఆలోచనలను పరీక్షించుకో! నీ మనసు దేనికి ముడిపడిందో..
నీ గుండెచప్పుళ్ల ధ్వనులనే
అడిగి గ్రహించుకో!..
నీలోనే సమస్తం ఉందని..
నీవే కర్త..కర్మ..క్రియవని..
కనిపించే భౌతికరూపాలన్నీ
అశాశ్వత దృశ్యాలని..
నీలోఉన్నదే శాశ్వతమని...
ప్రత్యక్షంగా దర్శించుకోగలగాలి!...
ఈ సమస్తం ఓ సుదీర్ఘస్వప్నం!..
భ్రాంతిలో మనల్ని నడిపిస్తుంది!..
నీలో నిత్యం అశాంతిని రగిలిస్తుంది!..
మనఃశాంతిని దూరం చేస్తుంది!..
నిన్ను నీవు నమ్ముకో!!... ఆత్మాభిమానంతో నడచుకో!..
నీ ఆశయసాధనే గమ్యంగా మలచుకో!..
ఆత్మశుద్ధతను ఆయుధంగా చేసుకో!!
ప్రతిరోజూ కొత్తగా సూరీడల్లే ఉదయించు!..
ఇంకా ఎంతో సాధించాల్సినది
మిగిలేవుందని అస్తమించు!!
ఎన్నడూ..ఏ దేవుడూ
నీకోసం పైనుండి దిగిరాడని చేదునిజాన్ని స్పర్శించు!!...
నీకు నీవే దేవుడoతటి వాడిగా మారి ఈలోకానికి సరికొత్తదారిని చూపించు!!....
అంబటి నారాయణ
నిర్మల్
9849326801