Authorization
Tue March 04, 2025 10:58:12 am
నీ పాట విని పుడమి తల్లి
పులకించి పోయె
ఎవరీ బిడ్డడని చూడంగ
ఈ బాలుడే బాలు అని తలంచి
భూమాత మురిసిపోయె !!
నీ పాట వినితెలంగాణ యావదాంధ్రుల జన్మాలు ధన్యంబయ్యె !!
తెలుగువారి మదిలోన ,హృదిలోన
నిలిచిపోయె చిరంజీవిగా !!
నీది జన్మంబు నీది కాదు
పది కోట్ల తెలంగాణ ఆంధ్రుల
పుణ్యఫలంబే
గాన గంధర్వునిగ జనియించే !!
సరస్వతీ మాత కరుణించ
సంగీత రసగంగ ఉప్పొంగ
రసమాధురీ మీ గళమున నర్తించగా
మాడెందమానంద సాగరమును చేరెలే !!
నిను గన్న నీ మాత పితల జన్మాలు ధన్యంబయ్యె
నీ పాట విన్న మా జన్మ తరియించె !!
ఎస్పీ బాలునీకు
వందనం వందనం !!!
సబ్బు నాగయ్య ప్రజాకవి
రాజుపేట