Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రకృతి ఒడిలో మట్టి సాక్షిగా
రంగు రంగు పూలు సేకరించి
అమ్మోరు రూపంలో
ఆడపడుచులు ఆరాధించే పండుగ
అక్క చెల్లెళ్లకోసం అన్న తమ్ముళ్లు పూలు సేకరించి
ఇంటిల్లిపాది సమిష్టిగా ప్రకృతిని శిష్టంగా ఆరాధించే విశిష్ట పండుగ
శృతి తప్పిన రాగంలా
లయ తప్పిన నాట్యం ల
పూలు పాయే కాగితం పూలు వచ్చే
లయబద్దంగా అడే బతుకమ్మ
దండియా లాగా అయే
శృతి తో అడపడుచుల నోటి వేంబడి ఎంతో సారం ఉన్న పాట మైకుల్లో హోరెత్తి పాత తరం లోకి
కొత్త పుంతలు వచ్చే
ఉద్యమాల ఉపిరికి
నిజాం నిరంకుశనికి
తెలంగాణ ఏర్పాటు కు
ఉథం అయ్యి సముద్రం అంత చరిత గలిగిన
నా తల్లి బతుకమ్మ మణిహారం సాంస్కృతిక సౌరభం
సృష్టి మర్మం అంత దాచుకొని ప్రకృతి జీవన సారం అని
పూలనే పూజించే పండుగ
మన సొంతం అని గర్వాంగా ప్రపంచానికి
తెలిపి ఆరోగ్యం ఆహారం
సమిష్టి జీవనం ఆడపిల్లలకు గౌరవం దక్కే
పండుగ వాసవి మాత రూపంలో ఉన్న అమ్మ కారుణించాలి ఉపాద్రవాలు పరద్రోలలి
నేటి తరం బతికే..ఆడపిల్లను బతికించే పండుగ సంబరాలు సమిష్టిగా అందాలి
ఇది పోటీ కోసం పంపుతున్న కవిత
-సుష్నిత్ వైద్య
అగ్రికల్చర్ పాలిటెక్నిక్
కామరెడ్డి