Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చంద్రకళ. దీకొండ,
మల్కాజిగిరి, మేడ్చల్ జిల్లా.
9381361384
ఇంటికి దీపం... ఇంటిల్లిపాదికీ
కంటి వెలుగు...ఆడపిల్ల!!!
ఈడొచ్చిననాటినుండీ ఈసడింపులతో
'ఆడ' పిల్లగా పెరిగినా...
మనసు మాత్రంఁఈడఁనే...
పుట్టింటి బాంధవ్యాల తోడనే!!!
చదువులందు మిన్నగా...
అధికారమందు అమ్మగా...
ఆటపాటలందు దీటుగా...
రాణిస్తుంది...
రాణిలా హృదయాల్ని పాలిస్తుంది...
లాలిస్తుంది!!!
కుంచెమంత కూతురుంటే చాలు...
మమతానురాగాల రాగం ఆలపిస్తూ...
ప్రేమాభిమానాల పరమాన్నం
వండి వడ్డిస్తుంది...
కొసరి కొసరి!!!
ఆప్యాయతనందిస్తూ తోబుట్టువుగా...
ఇంటిని తీర్చిదిద్దే ఇల్లాలిగా...
సమస్యల్లో సలహాలనిచ్చే స్నేహితురాలిగా...
ఇంటిల్లిపాదినీ కాచే అమ్మగా...
పలురూపాల పరాశక్తి ఆడపిల్ల!!!
పండగొస్తే నీ ఇంటికి తెస్తుంది కళ...
తాను ఇంటిలో ఉంటే నీ
కనులకు పండుగ...
మెట్టినింటిలో తానున్నా...
ఉంటుంది ఎల్లప్పుడూ నీకండగా!!!
ఆటబొమ్మగా అలుసుగా
చూడకు ఆడపిల్లను...
భవిష్యత్తులో నిన్ను
ఆదరించే అమ్మను...
వరాల కొమ్మను!!!!!!!!!