Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శ్రీమతి గద్దె అనంతలక్ష్మి
నరసరావుపేట, గుంటూరు ప్రధానోపాధ్యాయని
8500988499
ఆశ్వయుజ శుద్ద పాడ్యమిన విరిసే తెలంగాణ సందింట
చిగురించే ఆశలకు చిరునవ్వుల తోరణానిగా
బతుకమ్మ పండుగై తెలంగాణ సాంస్కృతిక ప్రతీకగా
నాటి గ్రామీణ అకృత్యకు మేలుకొలుపై
కష్ట,సుఖ,ప్రేమ,ఆప్యాయతల మేళవింపై
అవనిలోన మెరిసే ఆడబిడ్డల విరాజితమై
అనురాగ పుష్పపు రంగుల సుమిళతమై
పుడమికి సోయగమై పూలచుక్కల వర్షమై
పేర్చెరే పూల కృతులను బతుకు అమ్మ దీవెనై
శివలింగ గుడి గోపుర మలు రూపాలై
జొన్న పంట కోత స్వాగత పలుకులతో
తెలంగాణ పడుచుల సంతసాలభరతమై
నవాబు,భూస్వాముల పెత్తనాలకు గొడ్డలి పెట్టై
విరిసినె పడతుల కట్టాల బాటకు పూలబాటై
గునుగు, తంగేడు,బంతి,చామంతి,మందారు సకల
నవ దిన పూల రంగుల త్రికోణ మనోహరమై
పసుపుకొమ్ముల కుంకుమ భాగ్యాల పొద్దు పొడుపులై
ఎంగిలి పూల,అటుకుల ముద్దపప్పు బతుకమ్మవై
నానె బియ్యం,అట్ల బతుకమ్మ రూపమై
అలిగిన బతుకమ్మగా ఇంటింటా కొలువై
వేపకాయల,వెన్నెల ముద్ద అలరింపువై
దుర్గాష్టమి కళల సద్దుల బతుకమ్మవై
సిరులు పంచు వెతలు దీర్చు గౌరమ్మవై
సోదరభావత్వ రంగరింపుల మానవహారమై
ఆడి,పాడిరే అందాల సొగస్సుల పడతులే
బతుకమ్మ,బతుకమ్మ ఉయ్యాలో సందళ్లై
బంగరు వేల్పుల బతుకమ్మల సౌభాగ్యమై
తెలంగాణా తల్లి కడుపున పురుడు పోసినే
రాష్ట్ర పండుగై ప్రజానేత్ర కల్వకుంట్ల చంద్రశేఖరునికి ఆరాద్య స్వర్ణ కాంతులీనమై విజయాల విజయదశమిన ఆడపడచులకు అంబరాన్నంటే బంగరు బతుకమ్మ జాడలై ఈ పర్వదిన నవ ఉషస్సుల శోబితానా!!!