Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అడవిన తంగెళ్లు తలనిండపూలతో
సింగారించుకున్నా
ముత్యాలు జాలూవారి విస్తరించినట్టు
గునుగుపూలు గుంపుగూడినా
రాచగుమ్ముళ్లు రాకుమారసొంటి గౌరమ్మను ఆకుపొత్తిళ్లలో ఊయలూపుతున్న
బీరపూపాదుల కొనలు పసుపుపూతతో మెరిసిపోతున్న
తటాకమంతా పగడపుపోతపోసినట్టు
తామరలు పరుచుకున్న
ఏఒక్కరూ పూలు దెంపలేకున్నరు
కరోనా పుణ్యమాయని
కాలుగడపదాటలేకున్నరు
సద్దులబతుకమ్మను మది నిలుపుకొని
యాడంత ఎదురుజూసిన జనం
గల్మముంగట కాచుకూసున్న
మహమ్మారిని దాటి బతుకమ్మను పిలువ
భయపడుతున్నరు
ఈపీడను నిలదొక్కుకొని
గౌరమ్మనాహ్వనించలేక
ముదితలంత మదనపడుతున్నరు
గండుకోయిలలై గళమెత్తె పెద్దమనుషులు
మూతికట్టుతో ముడుచుకూసున్నరు
చప్పట్లతాళాలతో దరువేసే పడతులంత
గుమిగూడభయపడి లోగిల్లు వీడకున్నరు
వీధులన్నీ పూలవనాలై
పల్లెలన్నీ పూలబోనమెత్తే వేళ
గాలిసోకి గావరైన పల్లె
బతుకమ్మకు వాయినాలియ్య భయపడుతున్నది.
- రాజశేఖర్ పచ్చిమట్ల
గోపులాపూర్, జగిత్యాల
9676666353