Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తిరునగరి పద్మ
తెలుగు పండిట్
హన్మకొండ ,వరంగల్ అర్బన్
8465817902
ఎగిలి వారంగా లేసి, బస్తా సంచులతో బయలెల్లి
రైలు కట్టలు, చెరువు కట్టల పొంటి తిరిగి,
పోటీలుపడి తెచ్చిన తంగేడు గునుగు గుమ్మడి రంగురంగుల తీరొక్క పూలతో..
అన్న, అయ్యలు పోయి అత్తింటినుండి అవ్వగారింటికి తోలుకొచ్చిన అక్కచెల్లెండ్ల తో..
కట్టసుఖాల కడగండ్ల ,సంబురాలు ముచ్చట్లతో, సద్దుల పొడులనుదంచుకొని..
పోటీలు పడి పెద్ద పెద్ద
బతుకమ్మలను పేర్సుకొని
అందంగా తయారయి
బతుకమ్మలతో బయలెల్లి న అమ్మలక్కలు..
చెరువు గట్టున బతుకమ్మలను పెట్టి
అత్తింటి కష్టాల కడగండ్లను పాటలుగా పాడేటి అక్కచెల్లెండ్ల పండుగ.. మన బతుకమ్మ పండుగ!
సుద్దులు చెప్పి, సద్దుల పెట్టి
గౌరమ్మను ఓలలాడించి
అత్తింట బుద్ధి కలిగి ఉండమని, అతివలందరూ
ఐక్యంగా పాడుకునే
సమైక్య పండుగ!
బావబామ్మర్దులంతా కొత్త బట్టలు కట్టి, పాలపిట్టను సూసి..
మాంసము, మందులతో విందులు చేసుకునే సరదాల దసరా పండుగ.
జమ్మి ఆకులు తెచ్చి, పెద్దల చేతిల పెట్టి.. కాళ్లకు మొక్కి
విజయాలు చేకూరాలని
ఆకాంక్షించే పండుగ మన దసరా పండుగ