Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-డి.అమీర్
కొమ్మేమర్రి, కర్నూలు జిల్లా
9642480702
తెలంగాణ ఆడపడుచు
బంగారు తెలంగాణ సొత్తువై
మూడున్నర కోట్ల
ప్రజల ఇలవేల్పువై
సంస్కృతి సంప్రదాయాల నిలువెత్తు రూపమై
తెలంగాణ అస్తిత్వాన్ని అవనికి చాటి
జనోద్దరణ కావించిన జగజ్జనని
తంగెడు, ముత్యాల, గునుగు పూలతో
పట్టుపీతాంబరాలు, కనకాభరణాలతో
శోభయమానంగా శోభిల్లే దివ్యమంగళ స్వరూపిణి
సత్వరజోతమో గుణాలకు ప్రతీకగా విరులపేర్చి
ఆటపాట నైవేద్యాలతో పూజలనొంది జలసింహాసనము
అదిష్టించు వరప్రదాయని
ఎంగిలిపూల బతుకమ్మగా మొదలై
నవమినాడు సద్దులబతుకమ్మగా
దుష్టశిక్షణ శిష్టరక్షణకై వెలసిన ఆదిశక్తి స్వరూపిణి
తెలంగాణ ఆడపడుచువైన
అమ్మలగన్న అమ్మ తెలంగాణ ఖ్యాతిని
దునియాకు చాటిన బ్రతుకమ్మ అందరిని బ్రతికించవమ్మ
అమ్మ బ్రతుకమ్మ అందుకో అక్షరనైవేద్యం
కాచుకో నీ బిడ్డల చిరకాలం