Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ బిడ్డలా సొత్తయిన బతుకమ్మా
శరత్కాలమున ప్రకృతి బిడ్డవై వెలసితివి !
అడవుల పూలందాలన్నీ
నీవేనమ్మా
ఎనిమిది రోజుల్లా బొడ్డమ్మా నీవు
తొమ్మిదో రోజునా సద్దుల బతుకమ్మ వైతివీ !
తంగేడు పూల దొంతరల నడుమ
తెల్లని గునిక పూవుల్ల నీవైన పసుపు గౌరమ్మా
తొమ్మిది దినాల పండుగ నీకమ్మా !
వాన చిలుకుల తో నిండిన పుడమి
పచ్చని పైరుల అందాల నడుమ
పచ్చని గుమ్మడి పూలు ఆకులు
పచ్చని తంగేడు బంతులు చేమంతులు
ఎర్రని తామరలు కారబ్బంతులు (ఎర్ర బంతిపూలు)
ఎత్తైన దొంతరులుగా పేర్చి అందంగా అలంకరించేరు
అతివలందరూ గుమ్మాడి పూవుతో నీవు పసిడి గౌరమ్మవైతివి
కన్నె పిల్లల నోముల పంట వైతివి
అత్తింటి వాయనం గ కాగితప్పూల బతుకమ్మ వైతివి!
అందమైన పూలన్నీ పేర్చి కొలిచితిమి బతుకమ్మా
ఆడ బిడ్డలంతా నిన్ను జానపదాల పాటలతో
ఆడేరుపాడేరు రోజుకో నైవేద్యం బెట్టేరు
మా పిల్లా పాపల పూజలందుకోమ్మా !
నీ కథలతో బతుకమ్మ ఆడేము పాడెము
నీకు మలిదాలు ఇచ్చేము
మమ్ము వెన్నంటి కాపాడుతూ
నువ్వు కలకాలం బతుకుతూ బతుకమ్మా! నీ వెలుగులతో నిండిన జగితిని రక్షించుమమ్మా !
- మణి కోపల్లె,కొండాపూర్ హైదరాబాద్
9703044410