Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-శనగపల్లి ఉమామహేశ్వరరావు
తెనాలి, 9676680426
బతుకమ్మ పండుగ
కనులనిండా వెలుగుగ
జరిపేను మనమందరం
ఓయమ్మలాల భామలం మేము
తంగేడు,గునుగు పూలు
బంతిపూలు,జాజీపూలు
చామంతులు, మల్లెలు
మందారాలు, గులాబీలు
మాలలు మాలలుగా తెచ్చేము
ఓయమ్మలాల భామలం మేము
పసుపుతో దుర్గమ్మను తీర్చి
కుంకుమ పూజలు చేసేము
బతుకమ్మ చుట్టూ చేరి పూజలు చేసి
భజనలు చేస్తూ తిరిగితిరిగి
పాటలు పాడేము, ఆటలు ఆడేము
ఓయమ్మలాల భామలం మేము
ఎల్ల లోకాలు శుభం గుండాలని
తెలుగు రాష్ట్రాలు చల్లగుండాలని
ఆ చల్లని తల్లి దుర్గమ్మ ,మాయమ్మ
బతుకమ్మను వేడేము
ఓయమ్మలాల భామలం మేము