Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-సుజాత పి.వి.ఎల్,
సైనిక్ పురి, సికిందరాబాద్.
ఆదివాసుల ఆశాజ్యోతి..
అమాయక గోండుల విప్లవ కెరటం...
నిరంకుశ నిజామ్ దురంతాలని ఎదిరించిన గంఢర గంఢుడు..
అరణ్య వీరుడు...
ఆదివాసులకి అడవులపై హక్కులుండాలని నినదించిన శూరుడు..
తన జాతి కోసం ప్రాణాలని సైతం లెక్క చేయకుండా పోరాడిన ధీరుడు...
అమాయక గోండులని చైతన్యపరచిన విప్లవ కెరటం..
తన కళ్ళముందే జాతికి జరుగుతున్న అన్యాయాన్ని చూసి,సహించలేక,..
ఆయుధం పట్టిన విప్లవాగ్ని...
బలమైన శత్రువుతో హోరాహోరీగా ఢీకొన్న బడబాగ్ని...
గెలుపై ఆశలు లేకున్నా,చివరి వరకు పోరాడి అమరుడైన భీమ్..
బాబేఝరి,జోడేఘాట్ ప్రాంతాలలో వెల్లివిరిసిన విప్లవ చైతన్యం...ప్రవహించే వేడి నెత్తురు..
ఇప్పటికీ,ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయిన జ్వాలాగ్ని..
తన జాతిని ప్రాణత్యాగంతో ..
ప్రపంచ చరిత్రలో లిఖించిన మహోన్నతుడు..!
కొమరం భీమ్..!!