Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మమ్ము క్షమించు తల్లీ
ఆదిశక్తివని నిను పూజిస్తాం
కానీ
మేము ఆడజాతిని
ఇంకా
వెంటాడుతూనే ఉన్నాం
వేటాడుతూనే ఉన్నాం
తల్లి గర్భంలో
ఉండగానే తుదముట్టిస్తాం ఒకవేళ
అదృష్టానికో.. దూరదృష్టానికో
బ్రతికి బట్ట కట్టిందా
పసికందైనా.. పండు ముసలియైనా మేం
మృగాళ్లుగా మారుతాం అయినా
మేం దుర్గమ్మను పూజిస్తూనే ఉంటాం
స్త్రీని మాతృమూర్తంటూ గౌరవిస్తాం
కానీ..ఆ మాతృత్వపు మూలమైన
ఋతు క్రమాన్ని అస్యహించుకుంటాం
వారి దేవాలయ ప్రవేశాన్ని అడ్డుకుంటాం
అమ్మా ....ఆది పరాశక్తి
మమ్ము క్షమించు తల్లీ
మా నోట్లోనే బెల్లాలు
కడుపు నిండా కత్తెర్లే
యంత్ర నార్యస్టు పూజ్యంత
రమంతే తత్ర దేవత అన్నారు
ఇక్కడ
దేవతలెలా సంచరిస్తారు బహుశా
అంతా రాక్షసులే మిగిలారేమో
-బత్తుల శ్రీనివాసులు