Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎందుకు సమాజం
ఒడ్డున కూర్చొని
కొంగ జపం చేస్తున్నారు?
ఎవరికొరకు ఈ దొంగ జపం?
ఎవరిమీద వలలు విసిరారు?
ఎవరికి మీ ఆశల
గాలం వేశారు?
మీ చూపులతో
చుట్టేసుకున్నారు?
ఏ అమాయకులు
మీ వలలో చిక్కుతారో?
ఏ దురదృష్ట వంతుడు
మీ స్వార్థానికి బలిఅవుతాడో?
తెలియని వేటగాళ్ళు మీరు!...
అర్థంకాని మోసగాళ్ళు మీరు!..
ఎందరు గాయపడుచున్నారో..?
ఎందరు బాధపడుచున్నారో..?
నిరంతరం తపించే
నిశ్శబ్దవేట మీది...
దశాబ్దాలు దాటినా
వేటాడడం పోలేదు...
ఆ కళ్లలో స్వార్థపుచీకట్లు
పోవడం లేదు...
నిలువెల్లా విషపు కుళ్లు వీడటం లేదు ...
ఎక్కడ...ఎందుకు
ప్రారంభమైందో...?
ఎవరికీ తెలియదు!...
కానీ అందరికి తెలుసు...
పేదవారిమీదనే
పెద్దోళ్ళ కన్నెర్ర!...
యుగాలనుంచీ
ఈగోడు పోలేదు..
తరతరాలనుంచీ
ఈ తగవులు తీరడంలేదు...
వీళ్ళ ధాటికి తట్టుకోలేక
ఎందరో అమాయకులు
అసువులు బాస్తున్నారు!...
ఇంకా.. ఎన్నాళ్లీ వేట!?
ఇంకెన్నేళ్ళు జనాన్ని తినడం!?
బతకలేక బతుకును
మోయలేక చస్తోన్నజనాలు..
కక్షలు తెలివవు...
ప్రతీకారం తెలియదు...
ఎవరి మీదా ద్వేషం పెంచుకోరు..
ఎవరినీ మోసం చేయరు...
వారి బతుకేంటో వారు బతుకుతారు..
ఇలాంటి వారిని
మాయమాటలతో
మభ్యపెట్టి మనసుకు దగ్గరై
ఆర్థికంగా..శారీరకంగా
దోచుకోడానికి ఎన్నిఎత్తులో..!? ఎన్నిచిత్తులో..!?
జపాలు చేస్తూ వలలు వేస్తుంటారు..
ఇలాంటి వారిని కనిపెట్టండి!!...
ఎంతటి వారైనా సరే పని పట్టండి!!...
వదిలించే మార్గం చూడండి!!..
- అంబటి నారాయణ
నిర్మల్
9849326801