Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తిరునగరి పద్మ
హన్మకొండ, 8465817902
పచ్చా పచ్చని పల్లెంత ఓ రాచ గుమ్మాడీ!
పొద్దుగాల లేచింది ఓరాచగుమ్మాడీ!
సింగిడి రంగుల పూల న్ని..//ఓరాచ//
అన్నాదమ్ములు తెచ్చినారు//ఓ//
అక్క చెల్లెలండ్లందరూ //ఓ//
తీరొక్క పూల తోటి//ఓ//
బతుకమ్మను పేర్చినారు//ఓ//
ఆడబిడ్డ లందరూ//ఓ//
అత్తగారిండ్ల నుండి//ఓ//
అవ్వగారింటికొచ్చినారు//ఓ//
అతివలందరు గూడ//ఓ//
అందంగా ముస్తాబయ్యి//ఓ//
తల్లీ పిల్లల బతుకమ్మలతో//ఓ//
డప్పుల సప్పుళ్ళ తోటి//ఓ//
ఊరూ వాడ బయలెల్లె//ఓ//
చిన్ననాటి దోస్తులంతా కలుసుకునిరి//ఓ//
కష్టసుఖాలరుసు కొనిరి//ఓ//
అన్నదమ్ములు పిస్తోలు పూలు,రీళ్ళతో//ఓ//
డాంబులుకాల్సు కుంట తోడొచ్చిరి//ఓ//
కోలాటాలు సప్పట్లతో//ఓ//
బతుకమ్మ నాడు కొనిరి//ఓ//
గౌరమ్మ తల్లికి సుద్దులు చెప్పిరి//ఓ//
సద్దులెన్నో మూటకట్టి//ఓ//
గంగమ్మ ఒడిలోకి సాగనంపిరి//ఓ//
వచ్చే ఏడాదికి మల్ల రమ్మని రి//ఓ//
పుస్తెలకు పసుపు తీసుకొని రి//ఓ//
వాయినాలిచ్చు కొనిరి//ఓ//
తెలంగాణ బతుకమ్మ సంబరాలు//ఓ//
అంబరాన్నంటుతాయి//ఓ//
సల్లంగ సూడమ్మా బతుకమ్మ తల్లి//ఓ//
కరోనా ని అంతం చేయమ్మా//ఓ//