Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-డా.రామక కృష్ణమూర్తి
బోయినపల్లి, సికింద్రాబాద్.
9948285353.
మానవమృగాల రక్తదాహం
నవనాగరిక తోడేళ్ళ కర్కశం
కన్నెపిల్లల పాలిట అమానుషం
సమాజ యవనికపై మరకలు
స్వేచ్ఛా, స్వాతంత్ర్యాల వికృత చేష్టలు
చేష్ఠలుడిగిన వ్యవస్థకు శాపాలు
చట్టాల చుట్టరికంతో నిర్వీర్యమై
ఆడపిల్లల పాలిట శాపాలై
జాతి సిగ్గుతో తలదించుకొనే దృశ్యాలు
కామంతో కళ్ళు మూసుకుపోయి
వావివరుసలు మరిచిపోయి
విచక్షణ,సంస్కారాలను వదిలేసి
నిస్సిగ్గుగా,నిర్లజ్జగా సాగుతున్న
అత్యాచార అనర్థాలు ఇంకెన్నాళ్ళు?
సత్వర న్యాయం జరగాలి
న్యాయవ్యవస్థ మేల్కొనాలి
నిప్పుకణికలై,విస్ఫులింగాలై
అమ్మాయిలు అగ్గిబరాటాలవ్వాలి.
స్వీయరక్షణలతో
కవచకుండలాలతో ఎదుర్కోవాలి.
సమాజమొక్కటై అండగా నిలబడాలి.