Authorization
Mon Jan 19, 2015 06:51 pm
.... జవేరియా
పటానుచెరు, 9849931255
అందమైన గులాబీల
చుట్టు అన్నీ గుచ్చుకునే ముళ్ళుంటాయి
అయినంత మాత్రానా
ఆ గులాబీ పువ్వు విచ్చుకోకుండా ఉంటుందా?
తనలోని మకరందాన్ని మనందరికి పంచకుండా పోతుందా?
పాల తెలుపులాంటి కలువపువ్వు చుట్టు మురికి నీళ్ళ మడుగుంటుంది
అయినంత మాత్రానా
వికసించకుండా ఉంటుందా?
కనువిందు చేసి ఆనందాన్ని ఇవ్వ కుండా పోతుందా?
అందమైన ఆడపిల్ల కూడా అలాంటి సుతిమెత్తని పువ్వులాంటిదే
అయిన దాని విలువ తెలియని కొందరు మూర్ఖులు
మధాందకారంతో కాలికిందేసి
దారుణంగా నలిపేస్తున్నారు
అందమైన ఆమెరూపాన్నీ చూసి ఓర్వలేక అసూయతో రగిలిపోతు
తుదముట్టిస్తున్నారు
అందుకే ఓ చెల్లీ
నేలమీది నా జాబిల్లీ!
నిన్ను నువ్వు కాపాడుకోవాలంటే ఒకరి
మీద ఆధారపడటం కాదు
నిన్ను నీవు సబలగా నిరూపించుకునేందుకు
ఆదిపరాశక్తిగా మారు!!