Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆళ్ల నాగేస్వర రావు
తెనాలి, 7416638823
బాలి కైతేనేం.... బాలింత అయితేనేం
ముదుసలి ఐ తేనేం.... మూగది అయితేనేం
తొమ్మిది నెలల పసి బాలింతయితేనేం
ఆడ తనముంటేచాలు
అత్యా చారానికి అర్హురాలేయని నుడివి
వావివరుసలు గాంచక
మానభంగాలు గావిస్తున్న మృగాళ్లను
ఏ నిర్భయ చట్టం ఆపగల్గుతుంది? !
పట్ట పగలే జంటగా తీరుగా డు చున్న
అబలలపై అత్యాచారాలు గావిస్తున్న
మదందా ముష్కరులపై
కొరఢా ఝుళిపించేదెవ్వరు !?
అర్ధ నగ్న వస్త్రధారణే
అత్యాచారాలకు మూలమని ఒకరు
అసమయ సంచారమే అఘాయిత్యాలకు
హేతువని మరొకరు
నొక్కి వక్కాణిస్తున్న తరుణంలో
అతివలను ఆదుకునే నాధులేవ్వరు !?
ఆడదంటే ఆటబొమ్మ కాదని
ఆడదే సృష్టికి మూలమని
తనచెల్లి, చెలియా, భార్యలూ ఆడవారేనని
వారిని గౌరవించడం తన కర్తవ్య మని
ప్రతి మగాడు గ్రహించి
పరివర్తనతో ప్రవర్తించిన నాడు
ఆనాడే స్త్రీ జాతికి వెలుగు
అప్పుడే పసిపిల్ల ల పై సైతం అత్యాచారాలు తొలుగు
అదియే బాపూజీ కలలు కన్న రామరాజ్య
స్థాపనకు తొలి అడుగు !