Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కటకం.రాజేష్
కనిపించని కన్నీటి బాధలు ఏన్నో..
తన గుండె చాటు భయాలు ఏన్నో..
కునుకు తీయని కాలాలు ఏన్నో..
బిక్కు బిక్కు మంటూ గడిపిన ఘడియలు ఏన్నో..
నమ్మించి మోసం చేసే సందర్భాలు ఎన్నో..
తన బాధలు ఎవరికి చెప్పినా
తమ స్వార్థం కోసం చేసే నమ్మక ద్రోహలు ఎన్నో..
తమ రాజకీయాల లబ్ది కోసం మభ్యపెట్టే హామీలు ఎన్నో..
బతుకమ్మ బతుకు అంటూ భరోసా ఇవ్వని పార్టీలు ఎన్నో..
నీటిలో పారే బతుకమ్మ బతుకులా
చివరికి బురదలో కుంగిపోయే అనాధాల ఆర్తనాదాలు ఎన్నో..
చీడపురుగుల చేతికి చిక్కి
అగ్గికి ఆహుతియైన అనాధ అశ్రువులు ఎన్నో..
ఒంటరిగా వెళ్తుంటే వెంబడించే
కామాంధుల వెకిలిచేష్టలతో పడే బాధలు ఏన్నో..
ఈ సమాజంలో చివరికి సమాధానము లేని
ఆనవాలు దొరకని ఆమె లాంటి కథలు ఏన్నో..
అయిన తమపై ఎన్ని ఘోరాలు జరిగిన
ఎన్ని అకృత్యాలు జరిగిన
తమ ఉనికిని చాటుతూ
అన్ని రంగాలలో సాధించిన విజయాలు ఎన్నో మరీఎన్నో.