Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చంద్రకళ. దీకొండ,
మల్కాజిగిరి, మేడ్చల్ జిల్లా
9381361384
చుట్టూరా సమస్యల ముళ్ళకంచెలు దాటుకుంటూ...
చుట్టుముట్టిన ఆపదలనుండి కాచుకుంటూ...
చిరునవ్వుతో సాగుతూ...
సహనంతో భరిస్తూ...!
గృహ హింసలను గుండెల్లో దాచుకుని...
సమాజపు చూపు ముళ్లను దులుపుకుంటూ...
ముళ్ల మధ్య నవ్వే పువ్వులా...
రాళ్ళ మధ్య ఉరికే వాగులా...!!
ఆత్మరక్షణే ఆలంబనగా...
ఆత్మవిశ్వాసమే ఆయుధంగా...
బతుకమ్మా...బతుకు...!
గర్భంలో ఊపిరి పోసుకొనేలోగా...
ఉసురు తీసే ఇంటి దొంగల
నుండి తప్పించుకొని...
పెంపకంలో వివక్షను తట్టుకుని...
నీవేమిటో నిరూపించు...
నీ ప్రతిభను తేటతెల్లపరుచు...
నీ తెలివిని ప్రదర్శించు...
నీ సామర్థ్యాన్ని గుర్తించు...!!!
పరాయి చోటయినా...
మెట్టినింటిలో పాదుకొనలేదా...?!
పెరిగిన చోటేదైనా...
మెట్టినింటిని నీ ఇల్లుగా తీర్చిదిద్దుకోలేదా...?!
బాధల వేవిళ్ళెన్నో భరించి...
మరో జీవికి జన్మ నివ్వలేదా...?!
ధైర్యాన్ని నింపుకుని...
అమాయకత్వాన్ని విడచి...
మాయగాళ్ల మాటలకు మైమరవక...
అప్రమత్తతను నిత్యం నీలో
భాగంగా చేసుకొని...!!!!!
నీ బతుకును నీవే బతుకు...
నీ గొప్పతనాన్ని నీవే చాటు...
ఆదమరవక బతుకు...
ఆనందంగా బతుకు...
బతుకమ్మా...బతుకు...!!!!!!!!