Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహేష్ వేల్పుల
తొండ, తిరుమలగిరి, సూర్యాపేట
9951879504
ఇది పాడు లోకం అని చెబితే నీ గర్భ గుడిలోనే ఉండేదాన్ని కదమ్మా..
ఆడపిల్ల అని తెలిస్తే వడ్లపు గింజతో చంపే రోజులు పోయాయని సంబర పడ్డా అమ్మా..
కానీ అంతలోనే ఈ పాశవికపు ఆకృత్యాలను తట్టుకోలేకున్న అమ్మా..
మానవ మృగాలకంటే అరణ్య మృగాలు మేలేమో అమ్మా..
అమ్మ నేను ఆడపిల్లగా పుట్టడం నేరమా నా శాపమా !!?..
మహిళే మరకతం అంటారే మరి నేడు మర 'ఖతం' చేస్తున్నారే ఏంటమ్మా..
ఆడపిల్ల ఆదిశక్తి అంటారే మరి నాకు శక్తి ఏది?..
ఆది శక్తి అని గుడిలో విగ్రహాన్ని చూస్తేనే తెలుస్తుందా..
దేవత అని మొక్కిన చేతులే నన్ను చిదిమిస్తే నా గోడు ఎవరికి చెప్పుకోవాలమ్మ..
అమ్మ నా ఒంటిపై గాట్లు కత్తి పోట్లుగా చీల్చుతున్నాయి..
నా తనువుని తాకుతుంటే నిలువెల్లా ప్రాణం పోతుందమ్మా..
ఈ నిర్జీవ శరీరం పై పడి పీక్కుతింటున్నాయి మానవ మృగాలు..
అమ్మా అమ్మా..
సృష్టికి మూలాధారం మహిళ
జీవ చలనానికి ఆయువు మహిళ
అనంత శక్తికి బాంఢగారం మహిళ
ప్రేమను వెదజల్లే కుసుమం మహిళ
అఘాయిత్యాలకు ఆవిరై పోతుంది
నిందలకు నిలువ నీడ కోల్పోతుంది
గూడు చెదిరిన పక్షిలా దుఃఖిస్తుంది
ఒంటరై ఓదార్పు లేక ఒలపోస్తోంది
ఓ మనిషి నీ ఆలోచనలో మార్పు రావాలి
ఆడదాన్ని ఆరాధిస్తే అంతట వెలుగే కదా
మహిళను గౌరవిస్తే అంతా మాన్వితమే కదా
బతుకమ్మ బతుకు కవి సమ్మేళనం కై రాసింది