Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గాదిరాజు రంగరాజు
8790122275
కళ్లుండిన కబోదులు వాళ్ళు
అమానసం అని తెలిసినా
గొంతెత్తి ప్రశ్నించ లేని మూగవాళ్లు
హత్యాచారం జరగ లేదనే
అసత్య హరిచంద్రులు వాళ్ళు
చెవులుండిన చెవిటి వాళ్ళు
నాలుక తెగ నరికి
నరం లేని నరరూప రాక్షలు వాళ్ళు
నడుం ఇరగగొట్టిన వీళ్ళుకన్నా
నంపుసంకులే దేవుళ్ళు
మదమెక్కిన వాళ్ళు
మానం తో ఆడుకునీ
మేము పతిత్తులు అంటే
సమాజం లో ఉచ్చనీచాలు ఉన్నాయి అనిపిస్తుంది
మసిపూసి మారేడు కాయ
చేసే వాళ్ళు
న్యాయ దేవతకు గంతలు కట్టేరు
లోకం కళ్లకు గంతలు కట్టేసి
నిజాన్ని నిర్భయంగా ఉప్పు పాతర వేసేరు వాళ్ళు
అన్నీ అయి పోయాక అన్యాయం జరిగి పోయాక
రక్షకభటుల రక్షణ ఎందుకో
ఛీ ఛీ ... పాడులోకం