Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హమ్మా... హమ్మా ఓ మనీషా
నాపేరు న్యాయదేవత అంటారందరు
నిన్ను ఓదార్చుదామంటే కనిపియ్యలేతల్లి
ఎందుకంటే నాకళ్లకు గంతలు
కట్టారు తల్లీ
నీపై మృగాలగుంపు దాడి
చేసిందని చదివాను
కానీ వినపడలే తల్లీ ఎందుకంటే
సాక్షులు చెబితేనే నాకు వినిపిస్తుంది
ఓ నాభారత సమాజమా......!
చూస్తున్నారుగా.
తల్లి లాంటి తల్లులను అక్కలాంటి
అక్కలను
బిడ్డల్లాంటి చెల్లెళ్లను మనుషులని
మరిచిరే
క్రూరమృగాలకంటే ఘోరంగా
హింసించిరే
సోదరిసోదర ఏంచేద్దాం వీళ్ళను
భాషాకుడా వెతుక్కుంటుంది వీళ్ళని
ఎలా తిట్టాలని
ఇక్కడ న్యాయం చాలా కాస్లీ రిచ్ఛ్
మాట రాని చీమలు కాకులుకూడా ఒక్కటిగుంటాయి దెబ్బకు దెబ్బ
తీసేదాక నిద్దుర పోవు
వాటికున్న చీము నెత్తురు మనకులేకపాయే
సమస్త అధికారలుండి ఎం లాభం
రోజుకో అపశకునం చ్చీ......!
కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు
ఏలుతున్న ఓరాజకీయ్యమా కాస్త
ఒళ్ళు చివుక్కుమంట లేదా
వాళ్ళంతా నీ బిడ్డలేనని
ఓ అధికార యంత్రాంగమా మీరు
అనుకోవట్లేదు స్త్రీ మూర్తులందరు
మాఅక్కా చెల్లెళ్లని
ప్రపంచం ముక్కునవేలేసుకుంటుది
ఇక్కడ ఈపాటిరక్షణ ఉందని
సామ దాన బేద దండోపాయాలు
పాలనకుండొచ్చేమో కానీ
పౌరుల పట్ల ఉండొద్దు కదా
సమస్త భారత ప్రభుత్వబలగమా
ఎం బరోసా నిద్దాం రేపటితరానికి
ఈ దేశంలో తల్లీ దండ్రులుగా
అవును నేను న్యాయాన్ని
తెలియక అడుగుతా మనకు
చరిత్ర నిండా ఎందరో వీరయోధులైన వీరవనితలున్నారు
వాళ్ళ లా పెంచాలిరా పెంచితే పిల్లల
ఇంటికో ఝాన్సీ ఇంటికో రుద్రమ్మలా
యుద్దవిద్ధ్యలు సైనికులకే కాదు
ఆత్మరక్షణకోసం ఆరి తేరాల
ఆత్మ విశ్వాసమే ముందుకు
నడిపేది నీ భయమే నీశత్రువు
ఒక్కసారి ఉగ్రరూపం పైకి తెచ్చుకో
వెయ్యి సింహాల బలమొస్తుంది
వెయ్యి సింహాల బలమొస్తుంది
నేను న్యాయాన్ని ఇది యూగాల
అనుభవం