Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రఫీ షేక్
ఏలూరు, ప. గో జిల్లా
9912721318
"యుత నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా....." అని శ్లోకాలు - సూక్తులు పలికే మనం నిజంగా స్త్రీని గౌరవిస్తున్నామా..? గౌరవం మాట దేవుడు ఎరుగు. కనీసం గుర్తిస్తున్నామా..?
విద్య-వ్యాపారం-వైద్యం-రాజకీయం-అంతరిక్షం వంటి పలు రంగాల్లో రాణిస్తున్నా మహిళలు తక్కువేమీ కాదు కదా..! అని మనకు మనమే సమాధానం చెప్పుకుంటే మాత్రం మన అంతరాత్మని మనం మోసం చేస్తున్నట్టే. వీటిల్లో రాణించేసినంత మాత్రాన మనం స్త్రీని గౌరవించేసినట్లేనా ..!! మన బాధ్యత ముగిసినట్లేనా..? ఈ రంగాల్లో రాణిస్తున్న వారంతా కలువపువ్వు వంటి వారు. వారికి బురదలోనైనా వికసించే శక్తి - సత్తా ఉంది. వీళ్లంతా అసాధారణ మహిళలు. మరి సాధారణ స్త్రీల సంగతేంటి. ఈ సాధారణ స్త్రీలనంతా మనం అసాధారణ స్త్రీలలా మార్చడానికి మనం ఏమి చేయగలం..? ఎలా చేయగలం..? ఎప్పటికి చేయగలం..? అనే ప్రశ్నలను మనకు మనమే సంధించుకుంటే తప్ప మన బాధ్యత ఏమిటో మనకు తెలిసిరాదు. మన ఈ బాధ్యతలను సైతం తమ భుజాలనేసుకునే స్త్రీలకు మనమిచ్చే గౌరవం ఏపాటిదో గత కొన్నేళ్ల కాలంలో లైంగికదాడి కేసుల రూపంలో సాక్ష్యం ఇస్తూనే ఉన్నాం. కాని మనకి ఇవేమీ పట్టవు. ఇంటికి వెళ్లగానే నీళ్లందించే భార్య మాత్రమే కావాలి. అన్నం వడ్డించే అమ్మ మాత్రమే కావాలి మనకు వారి గురించి మనకేమి తెలియదు, తెలుసుకోవాల్సిన అంత అవసరము, సమయము కూడా లేదు మనకు ఎందుకంటే ఈ ప్రపంచాన్ని మార్చేసే విశ్వప్రయత్నం చేస్తున్నాము కదా! మారాల్సింది వాళ్లు కాదు.
మిత్రమా..! మార్చాల్సింది వాళ్లేసిన దుస్తుల్ని కాదు మిత్రమా..! మారాల్సింది మన ఆలోచనా విధానమే..! దీనికోసం మనం పెద్దగా ఏమీ చేయనవసరం లేదు, జస్ట్ గౌరవిద్దాం. మనతోపాటు, మనతో సమానంగా బ్రతకనిద్దాం. "అమ్మల్ని అక్కల్ని-చెల్లెళ్లని భార్యల్ని మాత్రమే కాదు ఆడవారినందరిని గౌరవిద్దాం." నిజంగా ఆడవాళ్లు అమాయకులు, ఎక్కువేమీ ఆశించరు. కొంచెం ప్రేమ, కొద్దిపాటి సమయం ఇవి ఇస్తే చాలు, నీకోసం వాళ్ల ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నవమాసాలు మోసి ప్రసవిస్తారు. తల్లిదండ్రుల్ని వదిలి వస్తారు, తోబుట్టువులను విడిచి వస్తారు. కేవలం నువ్వు గౌరవిస్తామని, ప్రేమిస్తావని, అర్థం చేసుకుంటావని, అపద్భాంధవుడు కావాలి.