Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డాక్టర్ కందేపి రాణి ప్రసాద్
సిరిసిల్ల, 9866160378
ఆకాశంలో సగం
గగనానికి అందం
నిండు జాబిలి
చితిమంటలలో
తగలబడిపోతుంది
అవని లో అర్ధ భాగం
సంసార రథచక్రం
క్షమయా ధరిత్రి
అకృత్యాలకు ఆహుతై
పాతి పెట్టబడుతుంది
యత్ర నార్యస్తు పూజ్యంతే
వాక్కుల వలువలు ఊడి
చినిగి చీలిక పీలికలై
ముళ్ళ పొదల కు
చిక్కుబడి పోతున్నాయి
నదుల్ని సైతం దేవతలని
పూజించే భారతావని
కన్నీటి సంద్రాల తో నిండి
ఉక్కిరి బిక్కిరి అయిపోయి
సుళ్ళు తో ఘోషిస్తుంది
అందరినీ కనే శక్తి
ఉన్న అమ్మ ఐకూడా
నిస్సహాయురాలై గా
రాక్షసుల పదఘట్టనల
కింద నలిగిపోతోంది
ఎవరు నీకు సాయం రారు
ఏ మనిషి నిన్ను కాపాడ డు
చెప్పే మాటలన్నీ కల్లబొల్లి కబుర్లు
చేసే వాగ్దానాలన్నీ నీటి మీద రాతలే
నిన్ను నువ్వే ఆయుధంగా మలుచుకో
నీకై నువ్వే రక్షణ కోసం పోరాడు
నువ్వు బలహీనురాలివి కాదు తల్లి
నీ ఆత్మ విశ్వాసాన్ని గుర్తించు చెల్లి
దగ్గరగా వస్తే దహించి వేసే య్
తాకాలని చూస్తే తాట తీసేయ్
కబళించాలని చూస్తే కాలరాసే య్
నీ గుండె నిబ్బరమే నీకు బలం